మ‌రోసారి కెప్టెన్సీ టాస్క్‌లో విఫ‌లమైన ఇంటి స‌భ్యులు

Fri,September 14, 2018 08:50 AM
Bigg Boss Takes a Drastic Step in episode 96

గ‌త రెండు రోజులుగా సాగుతున్న రిమోట్ కంట్రోల్ టాస్క్ ఎపిసోడ్ 96తో ముగిసింది. ఈ టాస్క్ ప్ర‌కారం బిగ్ బాస్ చెప్పిన‌ప్పుడు ఫ్రీజ్ అవ్వ‌డం ఆయ‌న రిలీజ్ అన్న‌ప్పుడు మాములు పొజీష‌న్‌కి రావ‌డం జ‌రిగింది. ఇక మ‌ధ్య‌లో కంటెస్టెంట్ ఇంటి స‌భ్యులు హౌజ్‌లోకి రావ‌డంతో అంద‌రు కాస్త ఎమోష‌న‌ల్ అయ్యారు. గురువారం జ‌రిగిన ఎపిసోడ్‌లో గీతా మాధురి భ‌ర్త నందు ఇంట్లోకి ప్ర‌వేశించి ఆమెతో స‌ర‌దా స‌మ‌యాన్ని గ‌డిపారు. ఆమెకి కొన్ని ట్రిక్స్ చెప్ప‌డంతో పాటు గీతా చెప్పిన విష‌యాల‌ని నందు స్వీకరించాడు.

గురువారం ఎపిసొడ్‌లో బిగ్ బాస్ హౌజ్‌లోకి దొంగ‌లు ప్ర‌వేశించి ఇంట్లో ఉన్న స‌రుకులు దొంగిలించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ స‌మ‌యంలో ఇంటి స‌భ్యులు అంద‌రు ఫ్రీజ్‌లో ఉన్నారు. అయితే ల‌గ్జ‌రీ బ‌డ్జెట్‌లో వ‌చ్చే వ‌స్తువుల క‌న్నా వారు దొంగిలించేది ఎక్కువ అని భావించిన త‌నీష్‌, సామ్రాత్‌, దీప్తిలు ఫ్రీజ్ మోడ్‌ నుంచి వెలుపలికి వచ్చి వారిని నియంత్రించే ప్రయత్నం చేశారు. దీంతో ఈ వారం వచ్చే లగ్జరీ బడ్జెట్ లో ఆ ముగ్గురు పాయింట్లపై బిగ్‌బాస్ కోత విధించాడు. ఇక ఈ వారం కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో సీజ‌న్ మొత్తం నామినేట్ అయిన కార‌ణంగా కౌశ‌ల్‌ని సంచాల‌కుడిగా నియ‌మించి మిగ‌తా ఇంటి స‌భ్యుల‌ని టాస్క్‌లో పాల్గొన‌మ‌ని కోరారు బిగ్ బాస్.

బిగ్ బాస్ టాస్క్ ప్ర‌కారం ఒక్కొక్క కంటెస్టెంట్ టేబుల్ పై ఉంచిన రంగు నీళ్ల గ్లాస్‌ని చేత్తో ప‌ట్టుకొని.. ఐదు బ‌జర్స్ మోగే వ‌ర‌కు నేల‌పై పెట్టకుండా ఉంచాలి. చివ‌రి వ‌ర‌కు గ్లాస్ స‌గానికి పైగా నీళ్ళ‌తో ఎవ‌రు ఉంటారో వారు విజేత‌గా నిలుస్తారని చెప్పారు. అయితే ఈ టాస్క్‌లో ఓ స‌భ్యుడు మ‌రో స‌భ్యుడి గ్లాస్‌ని ఏదో ర‌కంగా ప‌డేయోచ్చు, లేదంటే అత‌నిని ఒప్పించి రంగునీళ్ళ‌ని ప‌డేయ‌మ‌ని చెప్పొచ్చు అని బిగ్ బాస్ అన్నారు. టాస్క్ బ‌జ‌ర్ మోగ‌గానే గీతా, అమిత్‌లు జైలు రూంలోకి వెళ‌తారు. వారి వెనుకే వెళ్ళిన తనీష్‌.. అమిత్ గ్లాస్‌ని ప‌డేస్తాడు. ఆ తర్వాత.. అమిత్ వెళ్లి సామ్రాట్, తనీశ్ నీళ్లని ఒలకబోస్తాడు. మధ్యలో సామ్రాట్.. గీతా మాధురి, దీప్తి నీళ్లను ఒలకబోయడంతో.. మూడు బజర్లు మోగేలోపే.. ఐదు మంది కంటెస్టెంట్స్‌ కెప్టెన్సీ టాస్క్‌ నుంచి వైదొలిగారు.

కిచెన్ రూంలోకి దాక్కున్న రోల్ రైడా మాత్రం మూడో బ‌జ‌ర్‌ వ‌ర‌కి ఉంటాడు. ఆ త‌ర్వాత ఆయ‌న గ్లాస్ కూడా ప‌డ‌గొట్టేస్తారు మిగ‌తా ఇంటి స‌భ్యులు. దీంతో బిగ్ బాస్ ఇచ్చిన సూచ‌న‌ల ప్ర‌కారం ఏ ఇంటి స‌భ్యుడు ద‌గ్గ‌ర గ్లాస్ కలర్ నీళ్లు లేకపోవడంతో.. ఈ వారం కూడా హౌస్‌కి కెప్టెన్‌గా ఎవరూ ఉండర‌ని బిగ్‌బాస్ తేల్చేశాడు. అంటే వ‌చ్చే వారానికి ఎలిమినేషన్ కోసం నామినేషన్ కాకుండా ఉండే అవ‌కాశాన్ని ఇంటి స‌భ్యులు పోగొట్టుకున్నారు. గత వారం ‘టికెట్ టు ఫైనల్’లో ఇదే ఛాన్స్ కోల్పోయిన ఇంటి స‌భ్యులు ఈ వారం కూడా మంచి అవ‌కాశాన్ని కోల్పోవ‌డం విశేషం.

ఇక కెప్టెన్సీ టాస్క్ పూర్తైన త‌ర్వాత దీప్తి తాను సేఫ్ గేమ్ ఎలా ఆడాలో గీతాకి వివ‌రిస్తున్న క్ర‌మంలో కెమెరా డూమ్‌ని ప‌గ‌ల‌గొట్టింది. ఈ క్ర‌మంలో బిగ్ బాస్ దీప్తికి జైలు శిక్ష విధించాడు. దాంతో పాటు ఇంట్లో ఉన్న అన్ని కెమెరాల ద‌గ్గ‌ర‌కి వెళ్లి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని బిగ్ బాస్ ఆదేశించారు. దీంతో 96వ ఎపిసోడ్ ముగిసింది.

3895
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles