ఊహించిందే నిజమైంది.. కౌశలే బిగ్ బాస్ సీజన్ 2 విజేత

Sun,September 30, 2018 09:04 PM
bigg boss season 2 winner koushal

బుల్లితెర‌పై సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న అతి పెద్ద‌ రియాలిటీ షో బిగ్ బాస్. హిందీలో మొద‌లైన ఈ రియాలిటీ షో ప్ర‌స్తుతం సౌత్ లోని అన్ని భాష‌ల‌కి పాకింది. తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్‌గా మొద‌లైన ఈ కార్య‌క్ర‌మం జూన్ 10న మ‌రో సీజ‌న్‌లోకి అడుగుపెట్టింది. నేచుర‌ల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన సీజ‌న్ 2లో మొత్తం 18 మంది కంటెస్టెంట్‌లు పాల్గొన్నారు. 113 రోజుల పాటు విజ‌య‌వంతంగా త‌మ జ‌ర్నీని కొన‌సాగించిన ఐదుగురు స‌భ్యులు మాత్ర‌మే చివ‌రి ఫైన‌లిస్ట్‌ల‌లో మిగిలారు. ఈ ఐదుగురిలో విజేత ఎవ‌ర‌నే దానిపై రెండు తెలుగు రాష్ట్రాల‌లో జోరుగా చ‌ర్చ జరిగింది. కౌశలే విజేత అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరలయినట్టుగానే.. అంతా ఊహించినట్టుగానే.. కౌశలే బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విన్నరయ్యాడు. బిగ్ బిస్ గ్రాండ్ ఫినాలేకు విక్టరీ వెంకటేశ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

ఐదుగురు ఫైనల్ కంటెస్టెంట్లలో ముందుగా సామ్రాట్ ఎలిమినేట్ కాగా.. తర్వాత దీప్తి, తనీశ్ ఎలిమినేట్ అయ్యారు. తర్వాత కౌశల్, గీతా మాధురి మాత్రమే ఇద్దరు ఫైనలిస్టులుగా మిగలగా.. వాళ్లను హోస్ట్ నాని స్టేజీ మీదికి తీసుకొచ్చారు. తర్వాత విక్టరీ వెంకటేశ్ ప్రత్యేక అతిథిగా వచ్చి కాసేపు నవ్వించారు. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విన్నర్ ను టీవీలో చూపించారు. అనంతరం వెంకటేశ్ చేతుల మీద బిగ్ బాస్ ట్రోఫీ, 50 ల‌క్ష‌ల‌ క్యాష్ ను కౌశల్ అందుకున్నాడు. తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 కు బై బై చెప్పేశాడు నాని.

5918
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles