పున‌ర్న‌వి నిర్ణ‌యంతో నామినేట్ అయిన రాహుల్

Wed,September 18, 2019 08:21 AM

బిగ్ బాస్ సీజ‌న్ 3 తొమ్మిదో వారంలో సోమవారం, మంగ‌ళ‌వారం నామినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగింది. సోమవారం రోజు మ‌హేష్ నామినేట్ కాగా మంగ‌ళ‌వారం ఎపిసోడ్‌లో రాహుల్‌, హిమ‌జ నామినేట్ అయ్యారు. దీంతో ఈ వారం ఇంటి నుండి రాహుల్‌, మ‌హేష్‌, హిమ‌జ‌ల‌లో ఒక‌రు ఎలిమినేట్ కానున్నారు. ఇక మంగ‌ళ‌వారం జ‌రిగిన 59వ ఎపిసోడ్‌లో బిగ్ బాస్.. హిమ‌జ‌ని సేవ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డంతో వ‌రుణ్ సందేశ్ పేడ ట‌బ్ నుండి లేచాడు. దీంతో ఆమె కోసం పేడలో పడుకున్న వరుణ్ కి హిమజ కంగ్రాట్స్ చెప్పారు. నా జీవితంలో ఎవరైనా గొప్ప త్యాగం చేశారు అంటే అది ఇదే అంటూ ఎమోషన్ అయ్యింది హిమజ.


ఇక రాహుల్ టెలిఫోన్ బూత్‌లోకి వెళ్ళ‌గా.. నువ్వు సేవ్ కావాలంటే పున‌ర్న‌వి ఈ వారం త‌ప్ప మిగ‌తా అన్ని వారాలు సెల్ఫ్ నామినేట్ చేసుకోవ‌ల‌సి ఉంటుంద‌ని తెలిపారు బిగ్ బాస్. ఈ విష‌యాన్ని రాహుల్‌.. పున‌ర్న‌వికి చెప్ప‌గా తాను బిగ్ బాస్ చెప్పిన ఒప్పందానికి అంగీక‌రించింది. కాని దీనిని రాహుల్ రిజెక్ట్ చేశాడు. నేను ఈ వారం క‌ష్ట‌ప‌డి ప్రూవ్ చేసుకుంటా. నా కోసం ప్ర‌తి వారం నామినేష‌న్‌లో ఉండ‌డం నాకు న‌చ్చ‌డం లేదు. నీ ప్లేస్ ఎవ‌రు ఉన్నా కూడా ఇలాంటి నిర్ణ‌య‌మే తీసుకునే వాడిని అంటూ ఇద్ద‌రు చాలా సేపు చ‌ర్చ‌లు జ‌రిపారు. చివ‌రికి పున‌ర్న‌విని ఒప్పించి తాను నామినేష‌న్‌లో ఉండేందుకు సిద్ధ‌మ‌య్యాడు రాహుల్‌.

ఇక ఆ త‌రువాత రవి టెలిఫోన్ బూత్‌కి వెళ్ళ‌గా.. నువ్వు సేవ్ కావాలంటే శివ‌జ్యోతి మెడ వ‌ర‌కు జుట్టు క‌ట్ చేసుకోవ‌ల‌సి ఉంటుందని బిగ్ బాస్ తెలిపారు. దీనికి వెంట‌నే ఓకే చెప్పిన శివ‌జ్యోతి త‌న జుట్టు క‌ట్ చేసుకొని కొత్త లుక్‌లోకి వ‌చ్చేసింది. ఇక బిగ్ బాస్ కెప్టెన్‌గా ఉన్న వితికా ప్ర‌త్యేక బాధ్య‌త‌ల‌ని ఉప‌యోగించి ఒక‌రిని నామినేట్ చేయ‌మ‌ని చెప్పారు. దీంతో వితికా.. హిమ‌జ‌ని నామినేట్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. వ‌రుణ్ పేడ‌లో ప‌డుకొని హిమ‌జ‌ని సేవ్ చేస్తే.. వితికా మాత్రం త‌న ప్ర‌త్యేక ప‌వ‌ర్ ఉప‌యోగించి హిమ‌జ‌ని నామినేట్ చేయ‌డం విశేషం.

ఈ వారం ఎలిమినేష‌న్ కోసం నామినేట్ అయిన వారిలో హిమ‌జ‌, రాహుల్, మ‌హేష్ ఉండ‌గా, ఎవ‌రు ఇంటి నుండి బ‌య‌ట‌కి వెళ‌తారు అనే విష‌యంలో ఆస‌క్తి నెల‌కొంది. ఇక బిగ్ బాస్ ఇంట్లో బిగ్ బాస్ కాలేజ్ ఏర్పాటు చేయ‌గా అందులో బాబా భాస్క‌ర్, వితికా, వ‌రుణ్ సందేశ్ లెక్చ‌ర‌ర్‌గా ఉంటార‌ని తెలిపారు. బాబా భాస్క‌ర్ ల‌వ్వాల‌జీ లెక్చ‌ర్‌గా, వితికా గాస్సిపాల‌జీ లెక్చ‌ర‌ర్‌గా, చిల్లాల‌జీ లెక్చ‌ర‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తార‌ని బిగ్ బాస్ పేర్కొన్నారు. టాస్క్ మొద‌లు కాగానే ముందుగా బాబా భాస్క‌ర్ ల‌వ్‌కి సంబంధించిన పాటాలు చెప్పి అల‌రించారు. ఆ త‌ర్వాత వితికా గాసిప్స్ ఎలా పుడ‌తాయో వివ‌రించింది. ఇక వ‌రుణ్ చిల్ ఎలా అవుతామో వివ‌రించాడు.

3194
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles