బిగ్ బాస్ గ్యాంగ్ సందడి చూశారా..!

Sun,November 17, 2019 12:40 PM

బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్ర‌మం ముగిసి చాలా రోజులే అవుతున్న‌ప్ప‌టికి, అందులో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ మాత్రం ప‌లు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ ఆ రోజుల‌ని గుర్తు చేస్తూ ఉన్నారు. ఇక మ‌ధ్య‌ మ‌ధ్య‌లో పార్టీలు, ఫోటోషూట్స్‌ ఇలా వారు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు . గ‌త రాత్రి మ‌హేష్‌, పునర్నవి, వితికా, హిమ‌జ‌,వ‌రుణ్‌, అలీ, అత‌ని భార్య మ‌సుమా రీ యూనియ‌న్ పార్టీ చేసుకున్నారు. క‌ల‌ర్ ఫుల్ డ్రెస్‌లో ఫుల్ సంద‌డి చేశారు. రాహుల్ ఒక్క‌డు ఈ గ్యాంగ్‌లో మిస్ కాగా, రాహుల్ మిస్ యూ అంటూ పోస్ట్ పెట్టింది పునర్న‌వి. ప్ర‌స్తుతం బిగ్ బాస్ 3 గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్న రీ యూనియ‌న్ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. రాహుల్‌.. ఆర్‌ఎక్స్‌100 ఫేమ్‌ హీరో కార్తీకేయ నటిస్తున్న 90 ఎమ్‌ఎల్‌ చిత్రంలో ‘సింగిల్‌ సింగిల్‌’ పాడారు. ఆ పాట రిలీజ్ సంద‌ర్భంగా కాస్త బిజీగా ఉండ‌డంతో వీరి పార్టీకి హాజ‌రు కాలేక‌పోయిన‌ట్టు తెలుస్తుంది.
4347
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles