బిగ్ బాస్ హౌజ్‌లో కొన‌సాగిన హ‌త్య‌లు.. హంతకులు ఎవ‌రు ?

Thu,August 30, 2018 08:39 AM
bigg boss episode 81 highlights

బిగ్ బాస్ సీజ‌న్ 2 ఎపిసోడ్ 80లో ‘మర్డర్ మిస్టరీ’ పేరుతో ల‌గ్జ‌రీ బడ్జెట్ టాస్క్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ టాస్క్‌లో గణేష్ మర్డర్ మిస్టరీని పసిగట్టే డిటెక్టివ్ పాత్రలో, రోల్ రైడా మర్డర్ మిస్టరీని ఛేదించే పోలీస్ ఆఫీసర్‌గా.. గీతా మాధురి హంతకురాలిగా.. మిగిలిన సభ్యులు పబ్లిక్‌గా ఉన్నారు. గీతా మాధురి ఎవ‌రికి తెలియ‌కుండా పలు హ‌త్య‌లు చేస్తుండ‌గా, రోల్ రైడా, గ‌ణేష్.. హంతకులని వెతికే ప‌నిలో ప‌డ్డారు. మంగ‌ళ‌వారం నాటి ఎపిసోడ్‌లో కౌశ‌ల్‌, శ్యామ‌ల చ‌నిపోగా బుధ‌వారం నాడు అమిత్‌, సామ్రాట్‌, దీప్తిలు చ‌నిపోయారు.

ఎపిసోడ్ 81లో డిటెక్టివ్‌, పోలీస్ ఆఫీసర్‌లు హంత‌కులు ఎవ‌ర‌నేది తెలుసుకునేందుకు అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నించారు. కాని ఫ‌లితం ల‌భించలేదు. ఈ ఎపిసోడ్‌లో ముందుగా అమిత్‌ చ‌నిపోయినట్టు బిగ్ బాస్ తెలిపారు. ఈ ఆ త‌ర్వాత సామ్రాట్ చ‌నిపోయాడు. అయితే అంద‌రిని చంపేది గీతా మాధురి, తనీష్‌, దీప్తిల‌లో ఒక‌రు అయి ఉంటార‌ని హౌజ్ మేట్స్ అనుమానం వ్య‌క్తం చేశారు. కాని అంత‌లోనే దీప్తి కూడా చనిపోయింద‌ని బిగ్ బాస్ తెల‌ప‌డంతో అంద‌రు షాక్ అయ్యారు. దీప్తి కూడా చ‌నిపోతే మ‌రి చంపేది ఎవ‌రంటూ హౌజ్ మేట్స్ చర్చ‌లు జ‌రిపారు. త‌నీష్‌, గీతాల‌లో ఒక‌రు చంపుతున్నార‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు.

హత్యల్ని ఎవరు చేస్తున్నారో కనిపెట్టాల్సిన డిటెక్టివ్ గణేష్, పోలీస్ రోల్ రైడాలు టాస్క్‌లో పూర్తిగా విఫలం అయ్యారు. హౌస్‌లో ఉన్న వాళ్లందరూ గీతనే హత్యల్ని చేస్తుందని కనిపెట్టేసినా.. గణేష్ మాత్రం గాగుల్స్‌ పెట్టుకుని బిల్డప్ ఇవ్వడంతో సరిపెట్టేశారు. ఇక రోల్ గీతాపై అనుమానం వ్య‌క్తం చేసిన క‌న్‌ఫాం చేయ‌లేక‌పోయాడు. అయితే బెడ్‌పై పసుపు పడేయ‌డం వ‌ల‌న గీతా మాధురే వ‌రుస హ‌త్య‌లు చేస్తుంద‌ని నిర్ణ‌యానికి వచ్చారు. ఇక అదే స‌మ‌యంలో గీతా మాధురికి బిగ్ బాస్ ఇచ్చిన 5 సీక్రెట్ టాస్క్‌లు పూర్తి చేసింది.

బిగ్ బాస్‌కి తాను సీక్రెట్ టాస్క్‌లు అన్ని పూర్తి చేసిన‌ట్టు తెలిపింది గీతా మాధురి. ఇంటి స‌భ్యులు గీతానే చంపుతుంద‌నే అనుమానం వ్య‌క్తం చేసిన ఆమె ఒప్పుకోలేదు. బిగ్ బాస్ ఆదేశం మేర‌కే తాను ఒప్పుకోవ‌డం లేద‌ని చెప్పుకొచ్చింది గీతా. అయితే బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌లో గీతా మాధురి విజ‌యం సాధిస్తే ఎలిమినేష‌న్ నుండి త‌ప్పించుకోవ‌డంతో పాటు సీజన్ మొత్తం నచ్చిన వారిని ఒకరిని ఎలిమినేట్ చేయోచ్చు అని చెప్పిన విష‌యం తెలిసిందే. సీక్రెట్ టాస్క్‌లో గీతా విజ‌యం సాధించ‌డంతో ఆమె ఎలిమినేష‌న్ నుండి త‌ప్పించుకుంది. ఇక తాను ఎవ‌రిని ఎలిమినేట్ చేస్తుందా అని అంద‌రు ఆలోచిస్తున్నారు. బిగ్ బాస్ హౌజ్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన కౌశ‌ల్‌నే తాను ఎంపిక చేసుకుంటుంద‌ని తెలుస్తుంది. ఒక వేళ గీతా .. కౌశ‌ల్‌ని ఎంపిక చేసుకుంటే ఈ సీజన్ మొత్తానికి ఆయ‌న ఎలిమినేషన్‌లోనే ఉండ‌నున్నాడు. మ‌రి కౌశ‌ల్ ఆర్మీ అత‌నిని ఎన్ని వారాలు సేవ్ చేస్తారో చూడాలి.

బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశ‌ల్ అవుతాడ‌ని చాలా మంది ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. కాని స‌డెన్‌గా బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్‌తో అంద‌రి మైండ్ బ్లాక్ అయింది. మ‌రో 20 ఎపిసోడ్స్ మాత్ర‌మే ఈ సీజన్‌లో ఉండ‌గా మ‌రి ప్ర‌తి నామినేష‌న్ నుండి కౌశ‌ల్ సేవ్ అవుతాడా లేదా అనేది చూడాలి. బిగ్ బాస్ .. ఇక్క‌డ ఏదైన జ‌ర‌గొచ్చు.

8253
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles