ఆ ఒక్క‌డిని మిన‌హాయించి.. రాఖీ శుభాకాంక్ష‌లు తెలిపిన పున‌ర్న‌వి

Sat,August 17, 2019 08:15 AM
Bigg Boss contestants as they get together to celebrate Rakshabandha

గ‌త సీజ‌న్‌లో సామ్రాట్‌, తేజ‌స్వి.. త‌నుష్‌, దీప్తి సున‌య‌న మ‌ధ్య ల‌వ్ ట్రాక్ న‌డ‌వ‌గా ఇప్పుడు సీజ‌న్ 3లో రాహుల్‌, పున‌ర్న‌వి మ‌ధ్య ల‌వ్ ట్రాక్ న‌డుస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇక ఎపిసోడ్ 27లో బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌ని బాయ్స్, గార్ల్స్ అంటూ రెండు టీములుగా స‌ప‌రేట్ చేసి క్విజ్ పెట్టాడు. బాయ్స్ గెలుపొంద‌డంతో వారు యాపి ఫిజ్ తాగే ఛాన్స్ పొందారు. ఇక రాఖీ సంద‌ర్భంగా ఇంటి స‌భ్యుల‌కి వారి ఇంటి నుండి రాఖీలు రావ‌డంతో వాటిని చూసి భావోద్వేగానికి గుర‌య్యారు.

జ‌ల్లంత క‌వ్వింత రావాలిలే సాంగ్‌తో ఇంటి స‌భ్యుల‌ని నిద్ర నుండి లేపారు బిగ్ బాస్. ఆ సాంగ్‌కి త‌మ‌దైన స్టెప్పులు వేసి అల‌రించారు. ఇక ఈ వారం ఇంటికి రెండు ఆయిల్ టిన్స్ మాత్ర‌మే కేటాయించ‌డంతో దానిపై కొద్ది సేపు చ‌ర్చ జ‌రిగింది. మ‌రో మూడు రోజుల‌కి వంట నూనె స‌రిపోతుందో లేదో అని ముచ్చ‌టించ సాగారు. ఈ మ‌ధ్య‌లో రాహుల్‌, వితికా, పునర్న‌వి డైనింగ్ టేబుల్‌పై కూర్చొని చ‌పాతీలు తింటున్నారు. మ‌ధ్య‌లో మ‌న పులిహోర రాజా .. పున‌ర్న‌వి చ‌పాతి తినిపిస్తే చాలా టేస్టీగా ఉంద‌ని, త‌న చేతితో తింటే కాస్త రుచి త‌గ్గింద‌ని బిస్కెట్స్ వేశాడు.

ఆ త‌ర్వాత బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల తెలివి తేట‌ల‌కి ఓ ప‌రీక్ష పెట్టారు. సావిత్రిని జ‌డ్జిగా నియ‌మించి హౌస్‌లో ఉన్న పురుషులు, మహిళలను రెండు గ్రూప్‌లుగా చేసి వారికి జీకే క్వచ్ఛన్స్ పెట్టారు. జ‌న‌ర‌ల్ క్వ‌శ్చ‌న్స్‌తో పాటు ఫ‌న్నీ ప్ర‌శ్న‌లు శివ‌జ్యోతి అడ‌గ‌గా వాటిలో కొన్నింటికి స‌రైన స‌మాధానాలు ఇచ్చారు. ఫైన‌ల్‌గా బాయ్స్ టీం విజేత‌గా గెలిచారు. కొద్ది సేప‌టి త‌ర్వాత బ‌జ‌ర్ మోగ‌డంతో ఇంటి స‌భ్యులు స్టోర్ రూంలోకి వెళ్ళారు. అక్క‌డ ఉన్న గిఫ్ట్స్ చూసి అవాక్క‌య్యారు. త‌మ జ్ఞాప‌కాల‌ని గుర్తు చేసుకుంటూ రాఖీ పండుగ‌ని జ‌రుపుకున్నారు.

వ‌రుణ్ సందేశ్‌.. హిమ‌జ‌తో రాఖీ క‌ట్టించుకోగా.. శివ‌జ్యోతితో అలీ రాఖీ క‌ట్టించుకున్నాడు. జ్యోతి నాకు దేవుడు ఇచ్చిన చెల్లి అని అలీ అన‌డంతో జ్యోతి క‌న్నీటి ధార ప్ర‌వాహంలా సాగింది.అలీకి రాఖీ కట్టినందుకు ఆమెకి గిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఇక శ్రీముఖి త‌న త‌మ్ముడి స్థానంలో ఎవ‌రిని ఊహించుకోలేన‌ని చెబుతూ.. త‌న‌కి ఇష్ట‌మైన బాబా భాస్క‌ర్‌తో త‌న చేతికి రాఖీ క‌ట్టించుకుంది. ఆ త‌ర్వాత ఆయ‌న ఆశీర్వాదం కూడా అందుకుంది.

ఇక పున‌ర్న‌వి టైం రాగా, వ‌రుణ్ సందేశ్‌ని చూస్తుంటే త‌న‌కి త‌న త‌మ్ముడు గుర్తొస్తాడు అని చెప్పింది. అందుకే అత‌నికి రాఖీ క‌ట్టాల‌ని అనుకుంటున్నానని పేర్కొంది. ఆ త‌ర్వాత రాహుల్‌కి త‌ప్ప ఇంట్లో ఉన్న వాళ్ళంద‌రికి రాఖీ శుభాకాంక్ష‌లు చెప్ప‌డంతో పులిహోర రాజా రాహుల్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఇక త‌న లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టేన‌ని రాహుల్ భావిస్తూ ఫుల్ ఖుష్ అయ్యాడు. రానున్న రోజుల‌లో వీరి ల‌వ్ ట్రాక్ ప్రేక్ష‌కుల‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తునడంలో ఎలాంటి సందేహం లేద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఇక ర‌వికృష్ణ‌.. హిమ‌జ‌,రోహిణితో క‌ట్టించుకున్నాడు. మ‌హేష్‌కి అషూ, రోహిణి, శివ‌జ్యోతి క‌ట్టారు. బాబా భాస్క‌ర్‌కి కూడా శివ‌జ్యోతినే రాఖీ క‌ట్టింది. బిగ్ బాస్ .. బాబా భాస్క‌ర్‌కి స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. బాబా సతీమ‌ణి మాట్లాడిన వీడియోని ప్లే చేయ‌గా,అది చూసి చాలా సంతోషించాడు. నాగార్జున గారు మీ పాప వ‌య‌స్సు ఎంత అని అడిగిన‌ప్పుడు మీరు 8 లేదా 9 అని చెప్పారు. కాని అవి రెండు త‌ప్పు. ఇప్పుడు త‌న వ‌య‌స్సు 10 సంవ‌త్స‌రాలు అని బాబా సతీమ‌ణి వీడియోలో పేర్కొంది. మొత్తానికి 26వ ఎపిసోడ్ చాలా ఫ‌న్నీగా, స‌ర‌దాగా సాగింది.

4780
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles