బిగ్ బాస్ 3 ప్రోమో వ‌చ్చేసింది

Sun,June 16, 2019 09:59 AM
bigg boss 3 promo out

ఎప్పుడా ఎన్న‌డా అంటూ బుల్లితెర ప్రేక్ష‌కులని ఊరిస్తున్న బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్ర‌మం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. స్టార్ మా యాజ‌మాన్యం త‌మ అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ ద్వారా బిగ్ బాస్ 3 ప్రోమో విడుద‌ల చేశారు. అతి త్వ‌ర‌లో ప్రారంభం అవుతుంద‌ని మాత్ర‌మే ఈ ప్రోమో ద్వారా హింట్ ఇచ్చారు. ప్రోమోని చూస్తుంటే ఈ సారి ఈ కార్య‌క్ర‌మాన్ని స‌రికొత్త‌గా రూపొందిస్తున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. సీజ‌న్ 3కి హోస్ట్‌గా నాగార్జున ఉంటారని వార్త‌లు వ‌స్తుండ‌గా, కంటెస్టెంటులుగా ప్ర‌ముఖుల పేర్లు వినిప‌స్తున్నాయి. కామ‌న్ మ్యాన్‌కి ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లో ఎంట్రీ లేన‌ట్టుగా అన‌ధికార స‌మాచారం. జూలైలో రెండో వారంలో లేదంటే చివ‌రి వారంలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ 3 కార్య‌క్ర‌మాన్ని హోస్ట్‌గా నాగార్జున ఎంత ర‌క్తి క‌ట్టిస్తారో చూడాలి. సీజన్ 1ని ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌గా, సీజ‌న్ 2కి నాని హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన విష‌యం విదిత‌మే.



4418
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles