బిగ్‌బాస్‌ను మరిచేలా ‘బిగ్‌బాస్ 2’

Wed,May 16, 2018 02:36 PM
Bigboss 2 to be better and bigger than First season


తెలుగులో వచ్చిన రియాలిటీ షో బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ షోకు ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సీజన్ టీఆర్పీ రేటింగ్స్‌లోను తనదైన వాహ చాటింది. ఇక మరోసారి బిగ్‌బాస్ షో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుంది. బిగ్‌బాస్ సీజన్ 2ను గ్రాండ్‌గా తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. బిగ్‌బాస్ సీజన్ 2కు న్యాచురల్ స్టార్ నాని హోస్ట్‌గా చేయనున్నాడట. రెండో సీజన్‌ను ఫస్ట్ సీజన్ కన్నా రిచ్‌గా చూపించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

సీజన్ 2 కోసం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అత్యాధునిక హంగులతో కూడిన స్టన్నింగ్ సెట్‌ను వేస్తున్నారట మేకర్స్. బిగ్‌బాస్ 2 సెట్‌లో కంటస్టంట్స్‌కు మంచి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంచనున్నారని టాక్. అంతేకాకుండా సీజన్ 2కు ప్రైజ్‌మనీని భారీ మొత్తంలో పెంచనున్నట్లు తెలుస్తోంది. వంద ఎపిసోడ్స్‌లుగా తీయనున్న సీజన్ 2 షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుంది. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నాని త్వరలోనే బిగ్‌బాస్ 2 సెట్స్‌లో జాయిన్ కానున్నాడు.

2817
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles