హౌజ్‌లోకి ప్ర‌దీప్ రావ‌డం వెనుక ఇంత ట్విస్ట్ ఉందా ?

Fri,July 20, 2018 09:08 AM
big twist in pradeep entry into bigg boss

బిగ్ బాస్ సీజ‌న్ 2 స‌క్సెస్ ఫుల్‌గా 40 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. రెండు రోజుల ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్ త‌ర్వాత ఇంటి స‌భ్యులు కాస్త రిలాక్స్‌గా క‌నిపించారు. ఉద‌యాన్నే చిల‌క‌లూరి చింతామ‌ణి అనే పాట‌కి మాంచి మాస్ స్టెప్పులేసి హౌజ్‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టించారు. ఆ త‌ర్వాత బిగ్ బాస్ ఇచ్చిన ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్ బిగ్ బాస్ బ్లాక్ బ‌స్ట‌ర్‌కి ప‌ని చేసిన న‌టీన‌టులు, సాంకేతిక బృందం అంద‌రికి పారితోషికం ఇచ్చే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని త‌నీష్ చ‌దివి వినిపిస్తాడు. పారితోషికాన్ని ఇచ్చే బాధ్య‌త అమిత్‌, బాబు గోగినేనికి అప్ప‌గించారు బిగ్ బాస్. సినిమాకి పనిచేసిన వారిని ఒక్కొక్క‌రిగా పిలిచి న‌గ‌దుని ఇవ్వాల్సి ఉంటుంది. ఒక స‌భ్యుడికి ఇచ్చిన పారితోషికం మ‌రొక స‌భ్యుడికి తెలియ‌కూడదు.అయితే ఇంటి స‌భ్యులు అమిత్‌, బాబుల‌ని ఒప్పించి ఎక్కువ పారితోషికం తీసుకునే ఛాన్స్ ఉంటుంది.

హౌజ్‌లో బ‌జ‌ర్ మోగ‌గానే స్టోర్ రూంలోకి వెళ్ళిన అమిత్‌, బాబు గోగినేనిలు సూట్ కేసులో మ‌నీని లెక్క‌పెట్టి ఎవ‌రెవ‌రికి ఎంత ఇవ్వాల‌నే విష‌యంపై ఓ నిర్ణ‌యానికి వ‌స్తారు. బిగ్ బాస్ చెప్పిన‌ట్టుగానే స‌భ్యుల‌ని ఒక్కొక్క‌రిగా పిలిచి పారితోషికాన్ని అందిస్తారు. ఈ క్ర‌మంలో స‌భ్యులు త‌మ‌కి కొంత ఎక్కువ మొత్తం ఇవ్వాల‌ని బాబుగోగినేనిని అడ‌గ‌గా, ఆయ‌న తెలివిగా స‌మాధానాలు చెప్పి వారిని పంపిస్తారు. ఆ త‌ర్వాత డైరెక్ట‌ర్‌,ప్రొడ్యూస‌ర్స్ మ‌ధ్య రెమ్యున‌రేష‌న్ గురించి ప‌లు చర్చ‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో హౌజ్‌లోకి స‌డెన్ ఎంట్రీ ఇస్తారు యాంక‌ర్ ప్ర‌దీప్‌. ఆయ‌న చూసి ఇంటి స‌భ్యులు ఒక్క‌సారిగా షాక్ అవుతారు. ఇంటిలోకి రాగానే త‌న‌దైన పంచ్‌ల‌తో హౌజ్ మేట్స్‌కి ఫుల్ ఎన‌ర్జీ అందిస్తాడు . ఎన్నో షోస్‌తో బిజీగా ఉండే మీరు ఇన్నాళ్ళు హౌజ్‌లో ఉండ‌డానికి ఎలా వ‌చ్చారు అని గీతా .. ప్ర‌దీప్‌ని ప్ర‌శ్నిస్తుంది. ప్ర‌దీప్ కూడా వ‌చ్చాడంటే మ‌న షో ఎంత హిట్ అయిందో అర్ధ‌మ‌వుతుందో అని తేజూ అంటుంది.

ప్ర‌దీప్ తో కాసేపు ఫ‌న్నీ డిస్క‌ష‌న్స్ జ‌రిపిన త‌ర్వాత ఇంటి స‌భ్యులు ఆయ‌న తెచ్చిన సూట్‌కేసులో బ‌ట్ట‌లు అత‌నివి కావ‌ని గుర్తించ‌డంతో ప్ర‌దీప్‌కి ఏదో ఒక శిక్ష వేయాల‌ని భావిస్తారు. ఇందులో భాగంగా ప్ర‌దీప్‌ని అంద‌రు తీసుకెళ్ళి జైలులో వేస్తారు. ఆ త‌ర్వాత 'కొంచెం నీరు.. కొంచెం నిప్పు’ సినిమా ప్రదర్శన జ‌రుగుతుంది. లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ప్రదర్శనను యాంకర్ ప్రదీప్‌తో పాటు హౌస్ మేట్స్ అందరూ చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు. కౌశల్, నందిని మధ్య రొమాంటిక్ సీన్లతో పాటు.. దీప్తి సునైనా రింగ రింగా ఐటమ్ సాంగ్ అల‌రిస్తుంది. సినిమాలో యాక్షన్, లవ్, రొమాన్స్, సెంటిమెంట్, ఫన్ మేళవింపుతో సినిమా హౌస్ మేట్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా చూసిన ప్రదీప్.. కంటెస్టెంట్స్‌ను అభినందించారు. అనంతరం కంటెస్టెంట్స్‌తో కలిసి రింగా రింగా ఐటమ్ సాంగ్‌కి స్టెప్పులు వేశారు.

ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడ‌నుకున్న ప్ర‌దీప్‌, తాను రావ‌డానికి గల కార‌ణం తెలియ‌జేస్తాడు. బిగ్ బాస్ షో త‌ర్వాత మొద‌ల‌య్యే పెళ్లి చూపులు అనే షో ప్ర‌మోష‌న్‌లో భాగంగా తాను హౌజ్‌లోకి వ‌చ్చిన‌ట్టు చెబుతాడు. ఈ షో ద్వారా త‌న లైఫ్ పార్ట్న‌ర్‌ని వెతుక్కోవాల‌ని భావిస్తున్నాన‌ని తెలియ‌జేస్తాడు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు ప్రదీప్. ఈ ప్రోమోలో ప్రదీప్ పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్న ఎదురు కావడం దానికి ప్రదీప్ స్పందిస్తూ.. ‘ఇలా అడుగుతూనే ఉంటారు నేను ఏదో జోక్ చెప్పి తప్పించుకోవడం ఇది రోజూ జరిగేదే. కాఫీ షేర్ చేసుకోవడం కాదురా ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి. ఒక్కరికైనా నచ్చుతావ్ గా అని అంటారండీ.. ఇదిగోండి ఇలా పెళ్లికి వచ్చిన ప్రతిసారి నెక్స్ట్ నువ్వే.. నెక్స్ట్ నువ్వే అంటున్నారండీ.. అందుకే అడక్కుండానే అన్నీ ఇచ్చిన టీవీ నాకొక భాగస్వామిని ఇస్తుందేమో రండి ఒకరి గురించి ఒకరు తెలుసుకుందాం’ అంటూ ప్రదీప్ పెళ్లి చూపులకు ఆహ్వానిస్తున్నారు.

మరి మన ప్రదీప్ ఎదురుచూస్తున్న అమ్మాయి మీరే అని అనిపిస్తే.. http://pellichoopulu.startv.com/ లో వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా ‘పెళ్లి చూపులు’ ప్రమోషన్ ప్రోమోలో తెలియ‌జేస్తారు . మొత్తానికి ప్ర‌దీప్ రాక వెనుక ఇంత ట్విస్ట్ ఉంటే, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవ‌రు వ‌స్తార‌నే విష‌యంలో ఇంకా స‌స్పెన్స్ కొన‌సాగుతూనే ఉంది. 40వ ఎపిసోడ్‌లో ప్ర‌దీప్ హ‌డావిడితో పాటు ఇంటి స‌భ్యులు చేసిన సంద‌డి బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి మ‌జాని అందిస్తే, నేటి ఎపిసోడ్‌లో ఎలాంటి ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు జ‌రుగుతాయో చూడాలి.

6955
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles