కాస్ట్యూమ్స్ కోసం భారీ షాపే ఏర్పాటు చేశార‌ట‌.!

Tue,February 6, 2018 11:27 AM
big shop for syeraa costumes

మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న‌ చిత్రం సైరా. ఇటీవ‌ల తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొలాచ్చిలో రెండో షెడ్యూల్ జ‌రుపుకోనుంది. ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుధీప్, న‌య‌న‌తార‌ లాంటి న‌టులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తెలుగు తొలి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. అయితే చారిత్ర‌క నేప‌ధ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్స్‌తో పాటు వెరైటీ కాస్ట్యూమ్స్‌ని కూడా సిద్ధం చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. దీపిక‌, ర‌ణ్‌వీర్‌, షాహిద్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన 'పద్మావత్' కి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పనిచేసిన చంద్రకాంత్ సొనావెన్ సైరా సినిమాకి పనిచేస్తున్నారు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా ఈ వర్క్ లో భాగం అవుతోంది. అయితే కాస్ట్యూమ్స్ కోసం అన్నపూర్ణ స్టూడియో పరిధిలోని ఎకరం స్థలంలో భారీ షాప్ ను ఏర్పాటు చేసి .. అందులో చిత్రానికి అవ‌స‌ర‌మైన‌ కాస్ట్యూమ్స్ అన్నింటినీ ఉంచుతున్నారట. ప్రతి రోజు కూడా ఆ రోజున ప్లాన్ చేసిన సన్నివేశాలను బట్టీ .. పాత్రధారులను బట్టి కాస్ట్యూమ్స్ ను సెట్ చేస్తారట. ఇదీ సంగ‌తి!

1334
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles