ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 11 సినిమాలు విడుదల

Thu,November 23, 2017 03:14 PM
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 11 సినిమాలు విడుదల

వచ్చే నెలలో బడా హీరోల సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి క్యూ కట్టనుండగా, చిన్న చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు నవంబర్ నెలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. గత వారం ఏకంగా తొమ్మిది సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటిపడగా .. కార్తీ, రకుల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తమిళ డబ్బింగ్ సినిమా ఖాకీ మంచి టాక్ సంపాదించుకుంది. ఇక ఈ శుక్రవారం ఏకంగా 11 సినిమాలు విడుదల కానుండడం పెద్ద షాకింగ్ గా మారింది

బాలకృష్ణుడు, మెంటల్ మదిలో, హే పిల్లగాడా, దేవిశ్రీ ప్రసాద్, నెపోలియన్, జూలి 2, జంధ్యాల రాసిన ప్రేమకథ, జూన్ 143, ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరున్నారండీ బాబు, బేబి, కోకో సినిమాలు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటిలో సాయి పల్లవి నటించిన హే పిల్లగాడా సినిమాపై అందరి దృష్టి ఉంది. అలానే నారా రోహిత్ నటించిన బాలకృష్ణుడు చిత్రం కూడా అభిమానులని అలరిస్తుందని భావిస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద జరగనున్న ఈ భారీ పోటిలో విజేతలు ఎవరో తెలుసుకోవాలంటే మరి కొద్ది గంటలు ఆగక తప్పదు.

1509

More News

VIRAL NEWS