బిగ్ బాస్ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం

Thu,February 22, 2018 03:25 PM
big boss kannada set fired

కన్నడ స్టార్ హీరో సుదీప్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 5 గత నెల చివర్లో ముగిసిన తెలిసిందే. ఈ సీజన్ లో చందన్ శెట్టి విజేతగా నిలిచారు. బిదాడికి 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఇన్నోవేటివ్ ఫిల్మ్ సిటీలో బిగ్ బాస్ హౌజ్ సెట్ వేయగా , ఈ తెల్లవారు జామున షార్ట్ సర్క్యూట్ కారణంగా సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయిన, ఆస్తినష్టం మాత్రం బాగానే జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న అగ్నిమాపక దళాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలని ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలని ఆర్పేందుకు దాదాపు 5 గంటల సమయం పట్టినట్టు తెలుస్తుంది.

1725
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS