బిగ్‌బాస్ 2కి మ‌రింత గ్లామ‌ర్ పెంచే ఛాన్స్ ..!

Thu,May 17, 2018 12:10 PM
big boss 2 contestants as heroines

బుల్లితెర‌పై సెన్సేష‌న్ క్రియేట్ చేసిన రియాలిటీ షో బిగ్ బాస్‌. ఎన్టీఆర్ హోస్ట్‌గా సీజ‌న్ 1 ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగింది. ఇక ప్ర‌స్తుతం సీజ‌న్ 2కి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. న్యాచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించనున్న సీజన్ 2 కోసం అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా భారీ సెట్‌ను కూడా వేస్తున్నారు. ఈ షో కోసం నానికి బిగ్‌బాస్ 2 మేకర్స్ రూ.4 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వ‌నున్నార‌ని ఫిలింన‌గ‌ర్ టాక్. బిగ్‌బాస్ 2 సెట్‌లో కంటెస్టంట్స్ కోసం అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారట. జూన్ నుంచి సీజన్ 2 షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తుండ‌గా, సీజన్ 2లో వంద ఎపిసోడ్స్ ఉండనున్నాయి అంటున్నారు. అయితే సీజ‌న్ 2పై జ‌నాల‌లో మ‌రింత ఆస‌క్తి క‌లిగించేందుకు గ్లామ‌ర్ బ్యూటీస్‌ని కంటెస్ట్‌లుగా తీసుకోనున్నార‌ని టాక్. అప్ప‌టి హీరోయిన్స్ గజాలా, తేజస్వి, సీనియర్ నటి రాశి, సింగర్ గీతా మాధురి, యాంకర్ శ్యామలలు ఈ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ పుష్క‌లంగా ఉంద‌ని అంటున్నారు. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది .

3097
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS