ఐష్‌ని సున్నితంగా మంద‌లించిన అమితాబ్‌

Sun,December 17, 2017 03:34 PM
big b warns to aish

మాజీ మిస్ ఇండియా ఐశ్వ‌ర్య‌రాయ్‌ని బిగ్‌బీ సున్నితంగా మంద‌లించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతుంది. 2015 స్టార్‌డస్ట్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో ఈ సంఘ‌ట‌న జ‌ర‌గ‌గా, ఆ వీడియో ఇప్పుడు వైర‌ల్ కావ‌డం విశేషం. స్టార్ డ‌స్ట్ అవార్డ్ వేడుక‌లో ‘జజ్బా’ చిత్రానికి గానూ ఐశ్వర్యారాయ్, ‘పీకూ’ చిత్రానికిగానూ అమితాబ్ బచ్చన్ లు ఉత్తమ నటీ నటుల అవార్డులను అందుకున్నారు. ఆ త‌ర్వాత మీడియాకి ముందుకు వ‌చ్చిన వీరిద్ద‌రిని రిపోర్టర్స్ ప్రశ్న‌లు వేసే స‌మయంలో .. 'ఈయనే బెస్ట్‌' అంటూ చిన్నపిల్లలా తన మామయ్య వైపు చూపుడు వేలు చూపింది ఐష్‌. వెంట‌నే రెస్పాండ్ అయిన బిగ్ బీ.. ‘ఐష్‌.. ఆరాధ్యలా ప్రవర్తించకు’ అని సున్నితంగా మందలించారు. మరి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ వీడియోని మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఐష్ ప్ర‌స్తుతం ఫ‌న్నేఖాన్ చిత్రంతో బిజీగా ఉంటే, అమితాబ్‌.. ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’, ‘102 నాటౌట్‌’, ‘బ్రహ్మాస్త్రా’ చిత్రాల్లో నటిస్తున్నారు.

3853
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS