తొలిసారి థ్రిల్లర్ జానర్ ట్రై చేస్తున్న బిగ్ బి తనయుడు

Fri,March 31, 2017 08:32 AM

తండ్రి హీరో, తనయుడు కూడా హీరోనే. అయితే తండ్రీ తనయులు పోషించే పాత్రల్లో, వాటి స్వభావాల్లో చాలా తేడా ఉంది. ఫాదర్ తన ఏజ్ కు తగ్గట్టు ఇప్పుడు సాఫ్ట్ కేరక్టర్స్ వేస్తున్నా ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మాన్ ఇమేజ్ ఉండేది. కానీ ఆయన కొడుకు ఇందుకు పూర్తిగా డిఫరెంట్. సాఫ్ట్ కేరక్టర్స్ వేసే హీరోగా అతనిపై స్టాంప్ పడింది. మరి ఆ ఫాదర్ ఎవరో కాదు అమితాబ్ బచ్చన్. ఆ కొడుకు అభిషేక్ బచ్చన్. సాఫ్ట్ హీరో అభి ఇప్పుడు ఓ థ్రిల్లర్ జోనర్ చేస్తున్నాడట.


అభిషేక్ బచ్చన్ చేసిన మూవీస్ ను ఒక్కసారి స్టడీ చేస్తే అతను చేసిన యాక్షన్ సినిమాలు చాలా తక్కువ. నిజం చెప్పాలంటే కొన్ని యాక్షన్ సినిమాల్లో చేసినా అభిషేక్ పార్ట్ తక్కువ. 2002లో రెఫ్యూజీ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు అభిషేక్ బచ్చన్. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కుమారుడిగా గుర్తింపు ఉన్న అభిషేక్ కు సాఫ్ట్ హీరో కేరక్టర్సే ఎక్కువగా వచ్చాయి.

అభిషేక్ బచ్చన్ సినిమాల్లోకి వచ్చిన మొదటి పదేళ్లలో ఎక్కువ సినిమాలే చేశాడు. ముఖ్యంగా 2005-2006లో ఇతర హీరోల పిక్చర్స్ కన్నా అభీ సినిమాలే ఎక్కువ. సాఫ్ట్ హీరోగా, రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. జమీన్, ముంబయి సే ఆయా మేరా దోస్త్, కుచ్ నా కహో, ఎల్ ఓసి కార్గిల్, హమ్ తుమ్, రన్, షరారత్, మై ప్రేమ్ కీ దీవానీ హూ, దేశ్, కభీ అల్విదా న కెహనా. లగే రహో మున్నా భాయ్, ధూమ్, సర్కార్ వంటివి చేశాడు.

అభిషేక్ బచ్చన్ – ఫర్ ది ఫస్ట్ టైం ఒక థ్రిల్లర్ జోనర్ చేస్తున్నాడు. విశికాంత్ కామత్ దాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ థ్రిల్లర్ డ్రామా స్టోరీని అభిషేక్‌ విని వెంటనే ఒప్పేసుకున్నాడట. ఇప్పటి వరకు అభిషేక్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తీసిన చిత్రాల్లో నటించలేదు. మే నుంచి ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్ అవుతుంది. దాదాపు రెండు షెడ్యూల్స్ లో షూటింగ్‌ పూర్తి అవుతుందట. గత ఏడాది అభిషేక్ నటించిన హౌస్ ఫుల్ 3 మూవీ నిజంగా హౌస్ ఫుల్ కలెక్షన్స్ నే సాధించింది.

1129
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles