అంద‌మైన మ‌న‌వ‌రాల‌కి బిగ్ బి స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్

Thu,November 16, 2017 02:46 PM
big b birthday wishes to his grand daughter

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ముద్దుల కూతురు ఆరాధ్య నేడు త‌న ఆరో పుట్టిన రోజు జ‌ర‌పుకుంటోంది. ఈ సంద‌ర్భంగా బ‌చ్చ‌న్ అభిమానులు చిన్నారికి స్పెషల్‌ బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేస్తున్నారు. ఇక అంద‌మైన మ‌న‌వ‌రాలికి బిగ్ బీ ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆరాధ్య త‌న చిన్న‌ప‌టి ఫోటో ప‌ట్టుకొని దిగిన ఫోటోని షేర్ చేస్తూ .. అప్పుడే ఎంత‌ ఎదిగిపోయిందో .. త‌ను మా ఇంట్లో ఉంటే ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు అని కామెంట్ పెట్టారు. ఇక త‌న మ‌న‌వ‌రాలికి చెప్పిన‌ విషెస్ ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు అని బిగ్ బీ త‌న బ్లాగ్‌లో రాశారు. గ‌త ఏడాది కూడా బిగ్ బీ ఆరాధ్యకు సంబంధించిన రెండు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రపంచంలోనే అందమైన మనవరాలు పుట్టిన రోజును జరుపుకుంటోంది. ఈ కాలం పిల్లలు చాలా తెలివైన వాళ్లు, చుట్టూ ఏం జరుగుతోందో వారికి బాగా తెలుసు అంటూ పోస్ట్ పెట్టాడు. సాయంత్రం ఆరాధ్య బ‌ర్త్ డే వేడుక‌లు గ్రాండ్‌గా జ‌ర‌ప‌నున్న‌ట్టు తెలుస్తుంది.





1907
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles