ఫిట్‌నెస్ రహస్యాలు చెప్పిన భూమిపెడ్నేకర్..వీడియో

Wed,March 6, 2019 05:16 PM
bhumi pednekar tells about fitness secretes to her Fans

2015లో దమ్ లగా కే హైసా చిత్రంతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది భూమి పెడ్నేకర్. మొదట 90 కిలోల బరువుతో చాలా లావుగా కనిపించిన ఈ నటి.. కొన్నాళ్లకు స్లిమ్‌గా తయారయి అందరూ అవాక్కయేలా చేసింది. 2017లో అక్షయ్‌కుమార్‌తో కలిసి నటించిన టాయ్‌లెట్..ఏక్ ప్రేమ్‌కథా చిత్రంలో ఎవరూ గుర్తుపట్టేలేనంత అందంగా మారింది భూమి. సుమారు 4 నెలలపాటు ఎంతో కష్టపడి వర్కవుట్స్ చేసి..ఏకంగా 32 కిలోల బరువు తగ్గింది. తక్కువ సమయంలో బరువు తగ్గేందుకు భూమి పెడ్నేకర్ అనుసరించిన ఫిట్‌నెస్ మంత్ర ఏంటో తెలుసుకోవాలని అభిమానులంతా ఎదురుచూశారు.

ఫిట్‌గా మారేందుకు కావాల్సిన కొన్ని రకాల టిప్స్‌ను అందించింది భూమి. బయటి ఆహారపదార్థాలు కాకుండా కేవలం ఇంట్లో చేసిన వంటకాలనే తినడం. చెక్కరకు సాధ్యమైనంతవరకు దూరంగా ఉండటం. వ్యాయామంలో చేరుకోదగిన లక్ష్యాలను పెట్టుకోవడం. ఆకలితో ఉండకుండా చూసుకోవడం. 250 క్యాలరీల కంటే తక్కువ శక్తి ఉన్న పదార్థాలను క్రమం తప్పకుండా ప్రణాళిక బద్దంగా తీసుకుంటుండం వంటి టిప్స్‌ను సూచించింది భూమి.
3208
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles