భ‌యాన‌కంతో పాటు ఉత్సాహాన్నిస్తున్న బూత్ సాంగ్

Wed,October 16, 2019 01:38 PM

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన‌ చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’. ఫర్హాద్ సంఝీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌కు జోడీగా కృతిసనన్..రితేశ్ దేశ్‌ముఖ్‌కు జోడీగా పూజా హెగ్డే .. బాబీ డియోల్‌కు జోడీగా కృతి కర్బంద నటించారు. హౌస్‌ఫుల్ ఫ్రాంచైజ్‌లో నాలుగో చిత్రంగా రాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఇటీవ‌ల విడుద‌ల అయింది . ఇందులోని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కి ఆస‌క్తి క‌లిగించాయి. పునర్జన్మ‌ల‌ నేపథ్యంలో 1419, 2019 మధ్య కాలంలో సాగే ఈ కథలో బోలెడన్ని వినోదాలు ఉంటాయని ట్రైల‌ర్‌ని బ‌ట్టి అర్ధ‌మైంది. దీపావళి కానుకగా అక్టోబ‌ర్ 25న‌ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 600 ఏళ్ల తర్వాత పుట్టిన స్టార్స్ ఏ ర‌కంగా ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నున్నార‌నేది సినిమా చూస్తే అర్ధ‌మ‌వుతుంది. తాజాగా చిత్రం నుండి బూత్ సాంగ్ విడుద‌ల చేశారు. ఇందులో అస్థిపంజ‌రాలు, వెరైటీ గెట‌ప్స్ లో స్టార్స్ సంద‌డి ప్రేక్ష‌కుల‌లో కాస్త భ‌యంతో పాటు ఉత్సాహాన్ని క‌లిగిస్తున్నాయి. మీరు ఈ వీడియో సాంగ్ చూసి ఎంజాయ్ చేయండి.


1743
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles