రోడ్డు ప్రమాదంలో నటి మృతి

Sun,May 20, 2018 10:38 AM
Bhojpuri film actress Manisha Rai killed in road accident

భోజ్‌పురి న‌టి మ‌నీషా రాయ్ (45) రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించడం పెద్ద‌ షాకింగ్‌గా మారింది. షూటింగ్ స్పాట్‌కి స‌హాన‌టుడు సంజీవ్ మిశ్రాతో క‌లిసి బైక్‌పై వెళుతుండ‌గా ఓ కారు వెనుక నుండి వ‌చ్చి బైక్‌ని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయ‌ప‌డ్డ మ‌నీషా సంఘ‌ట‌నా స్థ‌లంలోనే మృతి చెందింది. మిశ్రాకి గాయాలు కాగా, ఆయ‌న్ని వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. బ‌ల్లియాలోని చిట్టౌని గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఖోబ‌ర్ అనే షార్ట్ ఫిలిం ద్వారా పాపుల‌ర్ అయిన మ‌నీషా ప‌లు టీవీ సీరియ‌ల్స్‌తో పాటు సినిమాల‌లోను న‌టించింది. ఆమె మృతి ప‌ట్ల భోజ్‌పురి చిత్ర ప‌రిశ్ర‌మ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది.

6699
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles