భీష్మ నుండి స‌ర్‌ప్రైజింగ్ వీడియో విడుద‌ల‌

Thu,November 7, 2019 10:57 AM

ల‌వ‌ర్ బోయ్ నితిన్ - వెంకీ కుడుముల కాంబినేష‌న్‌లో భీష్మ అనే సినిమా రూపొందుతున్న‌ సంగ‌తి తెలిసిందే. రష్మిక మందన్న చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా చిత్రం నుండి రెండు ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట‌ర్స్ విడుద‌ల చేసిన టీం కొద్ది సేప‌టి క్రితం గ్లింప్స్ వీడియో విడుద‌ల చేసింది. త్రివిక్ర‌మ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌లైన వీడియో అభిమానుల‌ని అల‌రిస్తుంది. ఫిబ్ర‌వ‌రి 21. 2020న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు వీడియో ద్వారా పేర్కొన్నారు.


మ‌రోవైపు నితిన్.. చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ర‌కుల్‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి చ‌ద‌రంగం అనే టైటిల్ పెట్టాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. కాగా, నితిన్ తనతో ఛల్‌ మోహన్‌ రంగ సినిమాను తెరకెక్కించిన కృష్ణ చైతన్య దర్శకత్వంలోను నితిన్ సినిమా చేయ‌నున్నాడు. మ‌రోవైపువెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

1464
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles