నితిన్ కొత్త చిత్రం మొద‌లు.. జూన్ 20 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్

Wed,June 12, 2019 12:08 PM

శ్రీనివాస క‌ళ్యాణం చిత్రం త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నితిన్ .. వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మా అనే సినిమా చేసేందుకు సిద్ద‌మైన సంగ‌తి తెలిసిందే. దాదాపు ప‌ది నెల‌ల త‌ర్వాత నితిన్ మ‌ళ్ళీ కెమెరా ముందుకు రాబోతున్నాడు. భీష్మా చిత్ర పూజా కార్య‌క్ర‌మాల‌ని కొద్ది సేప‌టి క్రితం పూర్తి చేయ‌గా, జూన్ 20 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌ప‌నున్నారు. రష్మిక మందన్న చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మ‌హ‌తి సాగ‌ర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే నితిన్ త్వ‌ర‌లో చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. వీటితో పాటు తనతో ఛల్‌ మోహన్‌ రంగ సినిమాను తెరకెక్కించిన కృష్ణ చైతన్య దర్శకత్వంలోను నితిన్ సినిమా చేయ‌నున్నాడు. సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ మూవీ బ్యానర్‌పై నితిన్‌ తండ్రి సుధాకర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. 2020 సమ్మర్‌లో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్‌కి ప‌వర్ పేట అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు టాక్. తెలుగుతో పాటు మ‌రో రెండు భాష‌ల‌లో విడుద‌ల కానున్న ఈ చిత్రంలో వేరే భాష‌ల‌కి చెందిన న‌టీన‌టులు కూడా ఉంటారని టాక్ .


1098
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles