త‌మిళ‌ ద‌ర్శ‌కుల సంఘం అధ్య‌క్షుడిగా భార‌తీ రాజా

Tue,June 11, 2019 10:37 AM
Bharathiraja elected directors association president

ఫిలిం మేక‌ర్ కె. భార‌తీ రాజా త‌మిళ సినీ ద‌ర్శ‌కుల సంఘం అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. క‌మ‌ల థియేట‌ర్‌లో జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ జ‌ర‌గ‌గా, అందులో సంఘం నాయ‌కులు భార‌తీరాజాని ఎక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘానికి ప్ర‌స్తుతం అధ్య‌క్షుడిగా విక్ర‌మ‌న్, కార్య‌ద‌ర్శిగా ఆర్‌కే సెల్వ‌మ‌ణి, కోశాధికారిగి పేరర‌సు బాధ్య‌త‌ల‌ని నిర్వ‌ర్తిస్తున్నారు. దర్శకుడు విక్రమన్‌ ఆరు సార్లు అధ్యక్ష పదవిలో కొనసాగడంతో ఈ సారి తాను పోటీ చేయడం లేదని వెల్లడించారు. దీంతో భార‌తీ రాజాని త‌మిళ సినీ ద‌ర్శ‌కుల సంఘం అధ్య‌క్షుడిగా కార్య‌వ‌ర్గం ఎంపిక చేసింది. త్వ‌ర‌లో న‌డిఘ‌ర్ సంఘం ఎల‌క్ష‌న్స్‌తో పాటు సౌత్ ఇండియా ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ( ఎస్ఐఏఏ) ఎల‌క్ష‌న్స్ కూడా జ‌ర‌గ‌నుండగా, మంచి పాల‌న అందించే వారికి త‌న మ‌ద్దతు ఇస్తాన‌ని భార‌తీ రాజా అంటున్నాడు.

974
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles