ఎన్టీఆర్‌లో మ‌రో పాత్ర‌పై వ‌చ్చిన క్లారిటీ ..!

Sat,August 18, 2018 12:42 PM
Bharat Reddy plays Daggubati Venkateswara rao role in ntr biopic

దివంగత మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ తెర‌కెక్కిస్తున్న‌ చిత్రం ఎన్టీఆర్. బాలకృష్ణ టైటిల్ రోల్‌ని పోషిస్తున్నాడు. యన్.బి.కె.ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న‌ ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సమర్పిస్తున్నాయి. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 9న మూవీ విడుద‌ల‌కి స‌న్నాహాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ సెకండ్‌ షెడ్యూల్ జ‌రుపుకుంటుంద‌ని తెలుస్తుండ‌గా, చిత్రంలో పాత్ర‌ల‌కి సంబంధించిన క్లారిటీ మెల్ల‌మెల్ల‌గా వ‌స్తుంది. బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించారు. ప్ర‌స్తుత ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర‌లో రానా నటిస్తున్నాడు. ఆయ‌న భార్య భువ‌నేశ్వ‌రి పాత్ర‌లో మ‌ల‌యాళ న‌టి మంజిమో మోహ‌న్ న‌టిస్తుంది . శ్రీదేవిగా ర‌కుల్ ప్రీత్ సింగ్, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ , హెచ్ఎమ్ రెడ్డి కోసం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ న‌టిస్తున్నారు.

అయితే ఎన్టీఆర్ కూతురు పురుందేశ్వ‌రి భ‌ర్త ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు పాత్ర కోసం డాక్ట‌ర్ భ‌ర‌త్ రెడ్డిని మేక‌ర్స్ ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. వెంక‌టేశ్వ‌ర‌రావు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కీల‌క వ్య‌క్తిగా ఉన్నారు. ఆయ‌న పాత్ర కోసం ప‌లువురిని ప‌రిశీలించిన టీం చివ‌రికి భ‌ర‌త్ రెడ్డిని ఫైన‌ల్ చేసింద‌ట‌. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ గెటప్‌లోని బాలకృష్ణ ఫస్ట్‌లుక్ విడ‌ద‌లైన సంగ‌తి తెలిసిందే. కాషాయ దుస్తుల్లో ఎన్టీఆర్ మాదిరిగా బాలకృష్ణ మైక్ ముందు నిల్చుని మాట్లాడే ఫోటో సినిమాపై భారీ అంచ‌నాలు పెంచింది.

4570
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles