డబుల్ సెంచరీ కొట్టిన ‘భారత్’

Wed,June 19, 2019 05:24 PM
Bharat movie Hits double century at Box Office


న్యూఢిల్లీ : బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినాకైఫ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం భారత్. అలీ అబ్బాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈద్ కానుకగా జూన్ 5న విడుదలైన ఈ చిత్రంకు మాస్, క్లాస్ ప్రేక్షకుల నుంచి అద్బుతమైన స్పందన వస్తోంది. భారత్ చిత్రం రెండు వారాల్లో రూ.201.86 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

సౌత్ కొరియన్ సినిమా ఆడ్ టు మై ఫాదర్ ఆధారంగా పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమాను తీశాడు అలీఅబ్బాస్ జాఫర్. జాకీష్రాఫ్ ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ తండ్రి పాత్రలో నటించగా..సునీల్ గ్రోవర్ సల్మాన్ స్నేహితుడి పాత్రలో పుల్ లెంగ్త్ రోల్ లో కనిపించాడు. టబు, దిశాపటానీ, నోరా ఫతేహి, ఆసిఫ్ షేఖ్ ఇతర పాత్రల్లో నటించారు. భారత్ అని పేరు పెట్టుకున్న సల్మాన్ తన దేశం పట్ల చూపించిన ప్రేమను సినిమాలో చూపించారు.3691
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles