ముఖ్యమంత్రిగా మహేష్.. ప్రీ లుక్ పోస్టర్ విడుదల

Wed,January 24, 2018 09:38 AM
bharat anu nenu pre look released

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ భరత్ అను నేను. మహేష్ 24వ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బేనర్పై డీవివి దానయ్య నిర్మిస్తుండగా, ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల చిత్ర నిర్మాణ సంస్థ ప్రమాణ స్వీకార పాఠంతో ఉన్న పోస్టర్ని విడుదల చేస్తూ, మూవీ ఫస్ట్ లుక్ని జనవరి 26న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ పోస్టర్లో భారీగా ప్రజలు, దానిపై ‘‘శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతః కరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’ అని ఉంది.

ఇక తాజాగా విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ లో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుగా ఉంది. ఆయన ముందు చాలా మంది ప్రజలు ఉన్నారు. ఈ పోస్టర్ పై కూడా కొన్ని ప్రమాణ స్వీకార పాఠం లిఖించారు. ఈ పోస్టర్ ద్వారా మూవీ ఫస్ట్ లుక్ ని జనవరి 26 ఉదయం 7గం.లకు విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రీ లుక్ పోస్టర్ ని బట్టి మహేష్ ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. తన ప్రతి సినిమాలో సమాజానాకి ఏదో ఒక మెసేజ్ ఇచ్చే కొరటాల భరత్ అను నేను మూవీ తో ఏ మెసేజ్ ఇస్తాడా అని అందరు ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 27న విడుదల కానుంది.

3216
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS