రికార్డుల ప‌రంప‌ర మొద‌లు పెట్టిన 'భ‌ర‌త్ అనే నేను'

Sat,April 21, 2018 11:21 AM
Bharat Ane Nenu  movie creates all the records

మ‌హేష్ బాబు, కైరా అద్వానీ ప్ర‌ధాన పాత్ర‌లో కొర‌టాల శివ తెర‌కెక్కించిన ఫిక్ష‌న్ చిత్రం భ‌ర‌త్ అనే నేను. ఏప్రిల్ 20న విడుద‌లైన ఈ చిత్రం ఫ‌స్ట్‌షోకి పాజిటివ్ టాక్ ద‌క్కించుకోగా, ప్ర‌స్తుతం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ళ ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంది. మొన్న‌టి వ‌ర‌కు రంగ‌స్థ‌లం చిత్రంపై ఉన్న రికార్డులని తుడిపేస్తుంది. చ‌ర‌ణ్ న‌టించిన రంగ‌స్థ‌లం చిత్రం తొలి రోజున త‌మిళ‌నాడులో 25ల‌క్ష‌ల గ్రాస్‌ని క‌లెక్ట్ చేయ‌గా, భ‌ర‌త్ అనే నేను 27ల‌క్ష‌లకి పైగా గ్రాస్ వ‌సూలు చేసి స‌రికొత్త రికార్డు సృష్టించింది. స్పైడ‌ర్ చిత్రంతో మ‌హేష్‌కి త‌మిళ రాష్ట్రాల‌లోను ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఈ క్ర‌మంలో అక్క‌డ మ‌రిన్ని వ‌సూళ్ళు రాబ‌ట్టొచ్చని స‌మాచారం. ఇక ఆస్ట్రేలియాలోను భ‌ర‌త్ అనే నేను మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంటలు మండిస్తుంది. అక్క‌డ 35 ప్రాంతాల‌లో ఈ చిత్రం విడుద‌ల కాగా తొలి రోజు 168,194 డాల‌ర్లు (85.45ల‌క్ష‌ల) వ‌సూళ్ళు సాధించి మ‌హేష్ స్టామినా ఏంట‌నేది నిరూపించింది. రానున్న రోజుల‌లో ఈ చిత్రం మరిన్ని రికార్డులు కొల్ట‌గొట్ట‌డం ఖాయంగా కనిపిస్తుందని సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు.


5272
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS