తమిళ స్టార్ హీరో చిత్రం తెలుగులో

Sun,April 16, 2017 01:20 PM
BHAIRAVA movie released in telugu very soon

ఇళయదళపతి విజయ్ తన 60వ సినిమాగా భైరవ అనే చిత్రాన్ని చేసిన విషయం విదితమే .. భరతన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కీర్తి సురేష్, అపర్ణ వినోద్ హీరోయిన్లుగా నటించగా, ప్రముఖ టాలీవుడ్ నటుడు జగపతి బాబు ముఖ్య పాత్ర పోషించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12,2017న విడుదల అయిన ఈ చిత్రం తమిళ ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంది. ఇప్పుడు ఈ మూవీని తెలుగులోను భైరవ అనే టైటిల్ తోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే విజయ్ సినిమాలు తెలుగులో మంచి ఆదరణని దక్కించుకోగా , ఈ చిత్రం కూడా తప్పక అలరించనుందని టీం భావిస్తుంది. తెలుగులో జగపతి బాబు, కీర్తి సురేష్ లకు ఉన్న క్రేజ్ మూవీకి తప్పక విజయంలో కీలక పాత్ర పోషించనుంది అని అంటున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే నెలలో థియేటర్స్ లోకి రానున్నట్టు తెలుస్తుంది.

1349
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles