వ‌ర్మ 'భైర‌వ గీత' ట్రైల‌ర్ విడుద‌ల‌

Sat,September 1, 2018 01:21 PM
Bhairava Geetha  trailer released

సంచలన ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మకి కొన్నాళ్ళుగా స‌రైన స‌క్సెస్ రావ‌డం లేదు. తన హోమ్ బేనర్ కంపెనీ ప్రొడక్షన్స్ పై ఆఫీసర్ అనే చిత్రాన్ని నిర్మించిన‌ వర్మకి ఈ సినిమా నిరాశ పరచింది. దీంతో కొన్నాళ్లు మౌనంగా ఉన్నాడు. ఇక ఇప్పుడు మరో చిత్రాన్ని తన నిర్మాణంలో రూపొందిస్తున్నాడు. భైరవగీత అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రంలో ధనన్జయక మరియు ఇర్రా హీరో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. సిద్ధార్ధ తాతులు ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. దాదాపు చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. అయితే కొద్ది సేప‌టి క్రితం చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ చూస్తుంటే ఈ మూవీ అభిమానులని త‌ప్ప‌క అల‌రించ‌నుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. మంచి కంటెంట్ తో వచ్చిన సినిమాలన్నీ భారీ విజయం సాధించడంతో ఈ సినిమా ఫలితంపై ఆస‌క్తి నెలకొంది. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

3420
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles