మరో సంచలనంతో ప్రేక్షకుల ముందుకు రానున్న వర్మ

Fri,August 31, 2018 04:51 PM
Bhairava Geetha  trailer release date fixed

సంచలనాలకు కేంద్ర బిందువు రామ్ గోపాల్ వర్మ. ఎప్పుడు ఏదో ఒక వార్తతో హాట్ టాపిక్ గా ఉండే వర్మ ఈ మధ్య సైలెంట్ అయ్యాడు. తన హోమ్ బేనర్ కంపెనీ ప్రొడక్షన్స్ పై ఆఫీసర్ అనే చిత్రాన్ని నిర్మించాడు వర్మ. ఈ సినిమా నిరాశ పరచింది. దీంతో కొన్నాళ్లు మౌనంగా ఉన్నాడు. ఇక ఇప్పుడు మరో చిత్రాన్ని తన నిర్మాణంలో రూపొందించిన వర్మ రేపు ట్రైలర్ రిలీజ్ చేయనున్నాడు. భైరవగీత అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రంలో ధనన్జయక మరియు ఇర్రా హీరో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. సిద్ధార్ధ తాతులు ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. దాదాపు చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. కొద్ది సేపటి క్రితం పోస్టర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు మేకర్స్ . పోస్టర్ చూస్తుంటే ఇదేదో అడల్ట్ మూవీలా అనిపిస్తుంది. మంచి కంటెంట్ తో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయం సాధించడంతో ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

4717
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles