ఫుల్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉన్న కామెడీ మూవీ ట్రైల‌ర్

Thu,November 21, 2019 08:34 AM

హాస్య‌న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస రెడ్డి ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా భాగ్య‌న‌గ‌ర వీధుల్లో గ‌మ్మ‌త్తు పేరుతో చిత్రాన్ని రూపొందిస్తున్న సంగ‌తి తెసిందే. కామెడీ ని నమ్ముకొని పైకి వచ్చిన శ్రీనివాస రెడ్డి.. కామెడీ బాక్ డ్రాప్ లోనే ఇప్పుడు తన తాజా చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు, సినిమా లో న‌టిస్తూ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నారు. జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురాకు ర‌చ‌యిత‌గా ప‌ని చేసిన ప‌ర‌మ్ సూర్యంశునే ఈ చిత్రానికి క‌థ‌తో పాటు స్క్రీన్ ప్లే, మాట‌లు స‌మ‌కూరుస్తున్నాడు. ఇందులో ష‌క‌ల‌క శంక‌ర్, స‌త్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. ఇందులో నో యాక్ష‌న్, నో సెంటిమెంట్ ఓన్లీ కామెడీనే ఉంటుంద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో ప్ర‌తి సన్నివేశం ఫుల్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంది. ఆర్జీవీలా నేనుండ‌డం కాదు, నా లానే ఆర్జీవి ఉంటాడు. జాకే బోల్ అని వెన్నెల కిషోర్ చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంటుంది. చిత్రం శ్రీను, రఘబాబు, సత్యం రాజేష్, సుమన్ శెట్టి కామెడీ కూడా ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బ న‌వ్విస్తుంది. డిసెంబర్ 6న ‘‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’’ చిత్రం విడుద‌ల కానుంది.

921
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles