హిజ్రాగా మ‌రో స్టార్‌ హీరో..!

Tue,February 20, 2018 08:26 AM
హిజ్రాగా మ‌రో స్టార్‌ హీరో..!

ఇటీవ‌లి కాలంలో మ‌న స్టార్ హీరోలు ఎలాంటి స‌వాళ్ళ‌నైనా స్వీక‌రిస్తున్నారు. నిజంగా ఇది శుభ‌ప‌రిణామం అనే చెప్పవ‌చ్చు. ముఖ్యంగా నెగెటివ్ యాంగిల్‌లో ఉన్న పాత్రల‌ని చేసేందుకు స్టార్ హీరోలు రెడీ అవ్వ‌డం కాస్త డేరింగ్ విష‌య‌మే. త‌మిళంలో విజ‌య్ సేతుప‌తికి చాలా క్రేజ్ ఉంది. తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా ఈ పేరు బాగా సుప‌రిచితం . మెగాస్టార్ 151వ చిత్రం సైరాతో విజ‌య్ సేతుప‌తి టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నాడు. విజ‌య్ సేతుప‌తి త‌మిళంలో ప‌లు చిత్రాల‌లో వెరైటీ ప్ర‌యోగాలు చేశాడు. తాజాగా సూప‌ర్ డీల‌క్స్ అనే మూవీ కోసం లేడీ గెట‌ప్ వేశాడు. రెడ్ కలర్ శారీలో.. బొట్టుపెట్టుకుని సాంప్రదాయబద్ధంగా క‌నిపిస్తున్న విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో ట్రాన్స్‌జెండ‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు . ఈ పాత్ర పేరు శిల్ప కాగా, ఎక్కువ మేకప్ లేకుండా లేడీ గెటప్ లో ఈ మాస్ హీరో ఒదిగిపోయిన తీరు అందరినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. ఇక మ‌రో హీరో ఉన్నిముకుంద‌న్ కూడా హిజ్రా పాత్ర‌లో క‌నిపించేందుకు సిద్ధ‌మ‌య్యాడు.
జనతాగ్యారేజ్, భాగమతి’ చిత్రాలతో తెలుగులోనూ తనకంటూ ఓ గుర్తింపుని సంపాదించుకున్న మలయాళ హీరో ‘చాణక్య తంత్రం’ అనే చిత్రంలో హిజ్రా తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. కరిష్మా అనే పేరుతో ఈ సినిమాలో కనిపించనున్న ఉన్ని పోస్టర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. హిజ్రా అనగానే ఏదో మేకప్ వేసుకుని కనిపించడమే అనుకుంటే పొరబాటే. ఈ పాత్ర కోసం ఉన్ని ప్రత్యేకంగా ప్రొస్తేటిక్స్‌ కూడా వాడాడట.1391

More News

VIRAL NEWS