భాగమతి ప్రమోషనల్ వీడియో సాంగ్ విడుదల

Wed,January 24, 2018 10:02 AM
భాగమతి ప్రమోషనల్ వీడియో సాంగ్ విడుదల

అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి వంటి విభిన్న కథా చిత్రాలలో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అనుష్క. ఈ అమ్మడి తాజా చిత్రం భాగమతి జనవరి 26న రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో విడుదల కానుంది. 'పిల్ల జమీందార్' ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన భాగమతి చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా గా తెరకెక్కగా ఈ చిత్రంలో అనుష్క ప్రధాన పాత్ర పోషించింది. ఆది పినిశెట్టి ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. విద్యు రామన్, జయరాం, ఉన్ని ముకుందన్ మరియు ఆశా శరత్ సపోర్టింగ్ రోల్స్ లో నటించారు. భాగమతి చిత్రాన్ని తెలుగులోనే కాక తమిళం, మలయాళ భాషలలోను డబ్ చేసి విడుదల చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో యూనిట్ .. సాంగ్స్, ప్రమోషనల్ వీడియోతో మూవీపై మరింత ఆసక్తి పెంచుతున్నారు. తాజాగా విడుదలైన వీడియోలో మూవీ మేకింగ్ తో పాటు అనుష్క కి సంబంధించిన కొన్ని సన్నివేశాలని కొత్తగా చూపించారు. మరి ఈ వీడియోని మరీ చూసి ఎంజాయ్ చేయండి.

958

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018