భాగమతి మూవీ వీడియో సాంగ్ వచ్చేసింది

Sat,January 20, 2018 04:36 PM
Bhaagamathie Malayalam Movie Song

అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి వంటి విభిన్న కథా చిత్రాలలో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అనుష్క. ఈ అమ్మడి తాజా చిత్రం భాగమతి జనవరి 26న రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో విడుదల కానుంది. 'పిల్ల జమీందార్' ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన భాగమతి చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా గా తెరకెక్కగా ఈ చిత్రంలో అనుష్క ప్రధాన పాత్ర పోషించింది. ఆది పినిశెట్టి ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. విద్యు రామన్, జయరాం, ఉన్ని ముకుందన్ మరియు ఆశా శరత్ సపోర్టింగ్ రోల్స్ లో నటించారు. భాగమతి చిత్రాన్ని తెలుగులోనే కాక తమిళం, మలయాళ భాషలలోను డబ్ చేసి విడుదల చేస్తున్నారు. తాజాగా మలయాళ వర్షెన్ కి సంబంధించి వీడియో సాంగ్ విడుదల చేశారు. ఉన్ని ముకుందన్ , అనుష్క ల మధ్య సాగే ఈ రొమాంటిక్ సాంగ్ అభిమానులని అలరిస్తుంది. మరి మీరు ఈ సాంగ్ పై ఓ లుక్కేయండి.

3111
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS