మదర్‌వుడ్ సాంగ్‌తో ఆక‌ట్టుకున్న బియాన్సీ - వీడియో

Mon,February 13, 2017 01:31 PM
Beyonce celebrates motherhood at Grammy Awards

లాస్ ఏంజిల్స్: పాప్ స్టార్ బియాన్సీ మ్యూజిక్ ప్రేక్ష‌కుల‌ను స్ట‌న్ చేసింది. గ్రామీ అవార్డు వేడుక‌ల్లో మ‌ద‌ర్‌వుడ్ సాంగ్‌తో అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. ప్రెగ్నెంట్ అయిన బియాన్సీ గ్రామీ ఫంక్ష‌న్‌లో ప్ర‌త్యేకంగా క‌నిపించింది. గోల్డ్ డ్రెస్‌లో వ‌చ్చిన పాప్ స్టార్ అమ్మ‌త‌నంలో ఉన్న క‌మ్మ‌ద‌నాన్ని త‌న పాట ద్వారా వినిపించింది. అవార్డు కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన సెల‌బ్రిటీలు ఆ సాంగ్ చూసి స్ట‌న్ అయ్యారు. సోష‌ల్ మీడియాలో ఇప్పుడా సాంగ్ వైర‌ల్‌గా మారింది. ఈజిప్ట్ క్వీన్ త‌ర‌హాలో అందంగా అలంక‌రించుకున్న బియాన్సీ సంతాన దేవ‌త‌గా ద‌ర్శ‌న‌మిచ్చింది. ఈ సాంగ్ ప్ర‌దర్శ‌న‌ స‌మ‌యంలో ఆమె అయిదేళ్ల కూతురు బ్లూ ఐవీ ఆమె చుట్టు తిరుగుతూ షాలో పాల్గొన్న‌ది. లెమోనేడ్ ఆల్బ‌మ్‌కు ఈ ఏడాది బియాన్సీ అవార్డు అందుకుంది.




గ్రామీ రెండు ముక్కలు
ఈ ఏడాది గ్రామీ అవార్డుల్లో పాప్ స్టార్ అడెలి అయిదు అవార్డులు గెలుచుకున్నది. సాంగ్ ఆఫ్ ద ఇయర్, ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను గెలుచుకున్నది. తాను గెలుచుకున్న అవార్డును బియాన్సీకి అంకితం ఇచ్చింది అడెలి. వాస్తవానికి 9 కేటగిరీల్లో బియాన్సీ నామినేట్ అయ్యింది. కానీ అడెలికి ఎక్కువ అవార్డులు వచ్చాయి. బియాన్సీని ఇష్టపడే అడెలి తాను అందుకున్న అవార్డును రెండు ముక్కలు చేసింది. తన అభిమానాన్ని చాటుకునేందుకు ఓ ముక్కను బియాన్సీకి అంకితం ఇచ్చింది అడెలి.

గ్రామీ విన్నర్స్
ఉత్తమ రాక్ సాంగ్- డెవిడ్ బోవీ (బ్లాక్ స్టార్)
ఉత్తమ ప్రత్యామ్నాయ సంగీత అల్బమ్-డెవిడ్ బోవీ (బ్లాక్ స్టార్)
ఉత్తమ రికార్డింగ్ ప్యాకేజ్-డెవిడ్ బోవీ (బ్లాక్ స్టార్)
ఉత్తమ రాక్ పర్ఫార్మెన్స్ -డెవిడ్ బోవీ (బ్లాక్ స్టార్)
ఉత్తమ నిర్మాత- గ్రెగ్ కర్‌స్టిన్ (నాన్ క్లాసికల్)
ఉత్తమ నిర్మాత- డేవిడ్ ఫ్రాస్ట్ ( క్లాసికల్)
ఉత్తమ సంగీత వీడియో- బీవన్స్( ఫార్మెషన్)
ఉత్తమ సంగీత చిత్రం- ద బీటిల్స్
ఉత్తమ దృశ్యమాధ్యమ సౌండ్‌ట్రాక్- జాన్ విలియమ్స్
ఉత్తమ పాప్ వోకల్ ఆల్బమ్- అడెలె(25)
ఉత్తమ పాప్, గ్రూప్ పర్ఫార్మెన్స్- ట్వంటీ వన్ పైలట్స్(స్ట్రెస్డ్ ఔట్)
ఉత్తమ రీమిక్స్‌డ్ రికార్డింగ్- ఆండ్రే అలెన్ యాంజోస్
ఉత్తమ పిల్లల ఆల్బమ్- సీక్రెట్ ఏజెంట్ 23 స్కిడూ( ఇన్ఫినిటీ ప్లస్ వన్)
ఉత్తమ సంగీత ఆల్బమ్- యోయోమా అండ్ దస్కిల్ రోడ్ ఎన్‌సెంబుల్- సింగ్ మీ హోమ్
ఉత్తమ జానపద అల్బమ్-సరాహ్ జరోస్జ్ ( అండర్ కరెంట్)
ఉత్తమ అమెరికన్ ఆల్బమ్ - విలియన్ బెల్ ( దిస్ ఈజ్ వేర్ ఐ లివ్)
ఉత్తమ హాస్య ఆల్బమ్- పటాన్ ఓస్వల్ట్ (ట్రాకింగ్ ఫర్ క్లాపింగ్)
ఉత్తమ రాక్ ఆల్బమ్- కేజ్ ద ఎలిఫెంట్ (టెల్ మీ అయమ్ ప్రెట్టీ) లకు పురస్కారాలు లభించాయి.

3699
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles