ఇశా అంబానీ ప్రీ వెడ్డింగ్‌.. బియాన్సీ చిందులు

Mon,December 10, 2018 03:41 PM
Beyonc� sings at Isha Ambani pre wedding event

ఉద‌య్‌పుర్‌: అమెరికా పాప్ సింగ‌ర్ బియాన్సీ .. అంబానీ పెళ్లి వేడుక‌లో చిందులేసింది. ముఖేశ్ అంబానీ కూతురు ఇశా అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుక‌లో గ్రామీ విజేత త‌న గ‌ళంతో ఆక‌ట్టుకున్న‌ది. ఈ వార‌మే బిలియ‌నీర్ ఆనంద్ పిర‌మ‌ల్‌ను ఇశా పెళ్లిచేసుకోబోతున్న‌ది. ఈ సంద‌ర్భంగా గ‌త వారం రోజుల నుంచి ఉద‌య్‌పుర్‌లో సంద‌డి నెల‌కొన్న‌ది. ఆదివారం ప్రీ వెడ్డింగ్ వేడుక‌లో భాగంగా భారీ మ్యూజిక్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. బాలీవుడ్ స్టార్స్‌తో పాటు బియాన్సీ కూడా ఆ ఈవెంట్‌లో త‌న పాట‌ల‌తో హోరెత్తించింది. అమెరికా మాజీ మంత్రి హిల్ల‌రీ క్లింట‌న్ కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. క్రేజీ ఇన్ ల‌వ్‌, సింగిల్ లేడీస్‌, ర‌న్ ద వ‌ర‌ల్డ్ లాంటి ఆల్బ‌మ్స్ చేసిన బియాన్సీ.. అంబానీ ఈవెంట్ కోసం స్లిట్ రెడ్ డ్రెస్సులో జిగేల్‌మంది. మ‌రో పాప్ స్టార్ ఎడ్ షీర‌న్ సాంగ్స్‌కు కూడా బియాన్సీ స్టెప్పులేసింది. బాలీవుడ్ హీరోయిన్లు ప్రియాంకా చోప్రా, దీపికా ప‌దుకునేలు కూడా డ్యాన్స్ చేశారు.


3403
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles