డింపుల్ క‌పాడియా త‌ల్లి క‌న్నుమూత‌..

Sun,December 1, 2019 12:51 PM

బాలీవుడ్ న‌టి డింపుల్ క‌పాడియా తల్లి బెట్టీ కపాడియా(80) కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం అనారోగ్య కారణాలతో ఆమె ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చేరారు. శ్వాస‌కోస సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆమెని కొద్ది రోజులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయితే ఆరోగ్యం విష‌మించ‌డంతో ఆమె క‌న్నుమూశారు. కాగా ఇటీవలే బెట్టీ కపాడియా తన 80 పుట్టినరోజును చేసుకున్నారు. కాగా, ఈ రోజు ఉద‌యం డింపుల్ కుటుంబ స‌భ్యులు బెట్టీకి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. సన్నీ డియోల్ ,అక్ష‌య్ కుమార్, ట్వింకిల్ ఖ‌న్నా త‌దిత‌రులు ఆమెని క‌డ‌సారి చూసేందుకు డింపుల్ ఇంటికి చేర‌కున్నారు.

2263
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles