ఉత్త‌మ న‌టుడిగా చ‌ర‌ణ్‌,న‌టిగా కీర్తి సురేష్‌

Fri,August 16, 2019 09:30 AM
Best Actress Award in siima is keerthy

ద‌క్షిణాదిన ప్ర‌తి ఏడాది ఎంతో ఘ‌నంగా జ‌రిగే అవార్డుల కార్య‌క్ర‌మం సైమా (సౌత్‌ ఇండియన్‌ ఇంటర్‌నేషనల్‌ మూవీ అవార్డ్స్‌). ఈ సారి ఖతార్‌లోని దోహలో ఈ అవార్డుల వేడుక జ‌రుగుతుండ‌గా, సౌత్ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన న‌టీన‌టులు కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఆగ‌స్ట్ 15న తెలుగు, క‌న్న‌డ సినిమాల‌కి సంబంధించిన అవార్డులు కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌లో రంగ‌స్థ‌లం చిత్రానికి గాను రామ్ చ‌ర‌ణ్‌ ఉత్త‌మ న‌టుడిగా ఎంపిక అయ్యారు. ఇక ఉత్త‌మ న‌టిగా మహాన‌టి చిత్రానికి గాను కీర్తి సురేష్ ఎంపికైంది. రాధిక చేతుల మీదుగా కీర్తి అవార్డు అందుకుంది. మ‌హాన‌టి చిత్రంలో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చిన కీర్తి రీసెంట్‌గా నేష‌న‌ల్ అవార్డు కూడా గెలుచుకున్న విష‌యం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉండ‌డం వ‌ల‌న సైమా వేడుకల‌కి చ‌ర‌ణ్ హాజ‌రు కాక‌పోవ‌డంతో ఉత్త‌మ నటుడి అవార్డుని చిరు అందుకున్నారు.


2227
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles