న‌టుడు బెన‌ర్జీ తండ్రి మృతి

Sun,April 15, 2018 01:04 PM
benarjee father passed away

న‌టుడు బెన‌ర్జీ తండ్రి రాఘ‌వ‌య్య (86) అనారోగ్యంతో మృతి చెందారు. టాలీవుడ్‌లో ప‌లువురు సీనియ‌ర్ న‌టులతో ప‌నిచేసిన రాఘ‌వ‌య్య చివ‌రిగా కొర‌టాల శివ తెర‌కెక్కించిన భ‌ర‌త్ అనే నేను చిత్రంలో న‌టిచారు. వీరాంజ‌నేయ‌, క‌థానాయ‌కుడు, య‌మ‌గోల వంటి సినిమాల‌తో పాపుల‌ర్ అయ్యారు రాఘ‌వ‌య్య‌. ఆయ‌న మృతికి టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ సంతాపం వ్య‌క్తం చేసింది. అభిమానుల సంద‌ర్శ‌నార్ధం ఆయ‌న మృత దేహాన్ని స్వ‌గృహంలో ఉంచారు. మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కి ఫిలిం న‌గ‌ర్‌లోని మ‌హా ప్ర‌స్థానంలో రాఘ‌వ‌య్య అంత్య‌క్రియ‌లు జ‌ర‌ప‌నున్నారు. రాఘ‌వ‌య్య త‌న‌యుడు బెనర్జీ తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌ర‌చితం. అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా కెరీర్ మొద‌లు పెట్టిన బెన‌ర్జీ ప‌లు తెలుగు సినిమాల‌లో స‌పోర్టింగ్ రోల్స్ తో మెప్పించాడు. రాఘ‌వ‌య్య ఆత్మ‌కి శాంతి క‌ల‌గాలని ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కోరుతున్నారు. రాఘ‌వ‌య్య కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి కూడా తెలియ‌జేశారు.

2275
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS