గ‌జ‌దొంగ చిత్రానికి ముహూర్తం ఫిక్స్..!

Tue,June 4, 2019 08:46 AM
Bellamkonda Sai Srinivas as thief

ఇటీవ‌ల సీత చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్ర‌స్తుతం రాక్ష‌సుడు అనే చిత్రం చేస్తున్నాడు. ఇటీవ‌ల చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా, ఈ టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది. ఇక దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రాల దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వర్ రావు’ బ‌యోపిక్ రూపొంద‌నుండ‌గా ఇందులో టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు పాత్రని బెల్లంకొండ చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ఆగ‌స్ట్ నుండి ఈ చిత్ర షూటింగ్ మొద‌లు కానున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఇందులో పాయ‌ల్ రాజ్‌పుత్‌ని క‌థానాయిక‌గా ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. 1980-90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా అంద‌రిని వ‌ణికించిన టైగ‌ర్ నాగేశ్వ‌ర్‌రావు బ‌యోపిక్ ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రించ‌నుంద‌ని అంటున్నారు .

3176
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles