క‌రీనా బ‌ర్త్‌డేని గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసిన సైఫ్‌

Sat,September 21, 2019 12:02 PM

బాలీవుడ్ బ్యూటీ క‌రీనా క‌పూర్ నేడు 39 వసంతంలోకి అడుగు పెట్టింది. కరీనా క‌పూర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా భ‌ర్త సైఫ్ అలీఖాన్, సోద‌రి కరీష్మా క‌పూర్ హరియాణాలోని ప‌టౌడీ ప్యాలెస్‌లో ఆమె బ‌ర్త్‌డే వేడుక‌ల‌ని ఘ‌నంగా జ‌రిపారు. త‌న భ‌ర్త చూపిస్తున్న ప్రేమ‌కి ఎమోష‌న‌ల్ అయిన క‌రీనా అత‌నిని హ‌గ్ చేసుకొని కిస్ ఇచ్చింది. కేక్ క‌ట్ చేస్తున్న స‌మ‌యంలో ఎంతో సంతోషంగా క‌నిపించింది క‌రీనా. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు బ‌ర్త్‌డే వేడుక‌కి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. క‌రీనా ప్ర‌స్తుతం అక్ష‌య్ కుమార్ గుడ్ న్యూస్ మ‌రియు ఇర్ఫాన్ అంగ్రేజీ మీడియం చిత్రాల‌లో న‌టిస్తుంది.


సెప్టెంబర్ 21, 1980లో రణ్‌ధీర్ కపూర్, బబితాలకు కరీనా కపూర్ జన్మించారు. ‘రెఫ్యూజీ’ సినిమాతో కరీనా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సహ నటుడు షాహిద్ కపూర్ తో చాలా కాలం డేటింగ్‌లో ఉంది క‌రీనా. మనస్పర్ధలు రావడంతో వీరు విడిపోయారు. కొన్నాళ్ల‌ తర్వాత కరీనా.. సైఫ్ అలీ ఖాన్‌‌తో బంధం ఏర్పడింది. సైఫ్, కరీనా 2012లో సైఫ్‌ను రహస్యంగా వివాహం చేసుకున్నారు. వీరికి 2016లో తైమూర్ పుట్టాడు. సైఫ్‌కు గ‌తంలో అమృతతో వివాహం జ‌ర‌గ‌గా, కొన్నాళ్ల త‌ర్వాత‌ విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
View this post on Instagram

Birthday girl ! ❤️💜❤️💜 #happybirthday #family #love

A post shared by KK (@therealkarismakapoor) on


1817
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles