అక్షయ్‌ ఫేవరేట్ రొమాంటిక్ సాంగ్

Wed,January 11, 2017 12:44 PM

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ నటిస్తోన్న తాజా చిత్రం జాలీ ఎల్‌ఎల్‌బీ2. సుభాష్‌కపూర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ షిబ్రవరి 10న విడుదల కానుంది. రిలీజ్ కి దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ స్పీడ్ పెంచింది. అక్షయ్ ఇప్పటికే తన అఫీషియల్ పేజ్ ద్వారా సినిమాను వీలైనంత మేరకు జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించి అనేక సాంగ్స్ విడుదల చేసిన అక్షయ్‌ తాజాగా తన ఫేవరేట్ రొమాంటిక్ సాంగ్ అంటూ ఓ పాటని షేర్ చేశాడు. ఈ పాటలోని పదాలు వినడానికి చాలా సింపుల్ గా ఉండడంతో పాటు అందంగా ఉంటాయని ఆయన అన్నారు. కోర్టు డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన జాలీ ఎల్‌ఎల్‌బీ2. మూవీలో అక్షయ్‌కుమార్ అవినీతికి వ్యతిరేఖంగా విధులు నిర్వర్తించే లాయర్‌గా కనిపించనున్నాడు. జాలీ ఎల్‌ఎల్‌బీ కి సీక్వెల్‌గా వస్తోన్న ఈ ప్రాజెక్టులో అక్షయ్‌కుమార్‌కు జోడీగా హ్యుమాఖురేషి నటిస్తోంది. తాజాగా విడుదలైన రొమాంటిక్ సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.

1113

More News

మరిన్ని వార్తలు...