'బంగార్రాజు' సెట్స్ పైకి వెళ్ళేదెప్పుడంటే ?

Fri,March 15, 2019 11:39 AM
Bangarraju to kick start in june

2016లో సంక్రాంతి కానుక‌గా విడుద‌లై అశేష ప్రేక్షాక‌ద‌ర‌ణ‌ పొందిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నా. నాగ్ డబుల్ షేడ్స్‌లో నటించి మెప్పించిన ఈ చిత్రం ఆయ‌న‌ కెరియర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించింది. బంగార్రాజు అనే పాత్ర‌లో నాగ్ త‌న న‌ట‌నతో ఆక‌ట్టుకున్నాడు. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి లు హీరోయిన్‌లుగా నటించగా, ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించే ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తుంది. క‌ళ్యాణ్ కృష్ణ సీక్వెల్ స్క్రిప్ట్‌కి ఫినిషింగ్ ట‌చెస్ ఇస్తుండ‌గా, జూన్ త‌ర్వాత ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. సీక్వెల్‌కు బంగార్రాజు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.

బంగార్రాజు చిత్ర క‌థ మొత్తం బంగార్రాజు చుట్టూనే తిర‌గ‌నుండ‌గా, ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంద‌ట‌. ఇక నాగ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా ర‌మ్య‌కృష్ణ‌ని ఎంపిక చేశార‌ని అంటున్నారు. చైతూ కూడా చిత్రంలో న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, బంగార్రాజు మ‌న‌వ‌డి పాత్ర‌లో నాగ చైత‌న్య క‌నిపించ‌నున్నాడ‌ట‌. ఆయ‌న‌కి జోడీగా ఎవరిని ఎంపిక చేయాలా అని చిత్ర‌బృందం క‌స‌ర‌త్తులు చేస్తుంద‌ట‌. అన్న‌పూర్ణ స్టూడియోస్ బేన‌ర్‌పై ఈ చిత్రం నిర్మితం కానుంది. త్వ‌ర‌లో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. మ‌రోవైపు నాగ్ మ‌న్మ‌థుడు 2 చిత్రంలో న‌టించేందుకు స‌న్న‌ద్ద‌మ‌వుతున్న విష‌యం విదిత‌మే.

974
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles