మ‌ల్టీ స్టార‌ర్ మూవీ ట్రైల‌ర్ విడుద‌ల‌

Sat,September 14, 2019 08:45 AM
Bandobast  Official Trailer  released

త‌మిళ స్టార్ హీరోలు సూర్య‌, ఆర్య‌.. మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం బందోబ‌స్త్‌. దేశరక్షణ, వ్యవసాయం, రాజకీయాలతో పాటు పలు సామాజికాంశాల్ని స్పృశిస్తూ ఈ చిత్ర‌ కథ సాగుతుంది. ఎన్‌ఎస్‌జీ కమాండోలు దేశంతో పాటు రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి కీలక వ్యక్తుల్ని రక్షించేబాధ్యతల్ని తీసుకుంటారు. దేశరక్షణలోప్రధాన పాత్రను పోషించే కమాండోల బృందాన్ని నడిపించే నాయకుడు చెడ్డవాడైతే ఏం జరుగుతుంది? అలా మారడానికి కారణమేమిటనే పాయింట్‌తో కె.వి.ఆనంద్ చిత్ర క‌థ‌ని రాసుకున్నారు. అలాంటి సంఘటనలే నిజంగా మన దేశంలో జరిగాయి. ఎన్‌ఎస్‌జీ కమాండోల వ్యక్తిగత జీవితం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగభరితంగా ఉంటాయి అని సూర్య అంటున్నారు. ఈ నెల 20న విడుద‌ల కానున్న చిత్ర ప్రీ రిలీజ్ వేడుక తాజాగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో బందోబ‌స్త్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. సాయేషా సైగ‌ల్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

1335
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles