పావలా శ్యామల మాటలకు కదిలొస్తున్న మానవతా వాదులు

Thu,January 14, 2016 06:01 PM
bandla ganesh  donates 20,000 to pavala syamala

ఒకప్పుడు తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న పావల శ్యామల ప్రస్తుతం కష్టాల కడగండ్లలో ఎదురీతున్నారు. నటిగా ఎన్నో అవార్డులు అందుకొని, ఎందరో అభిమానులను అలరించిన శ్యామల కనీసం కుటుంబ పోషణకు డబ్బులేక ఆత్మహత్య చేసుకునేందుకు కూడా సిద్దమయ్యారు. ఎందరో సినీ పెద్దలను కలిసిన తనకు ఫలితం దక్క లేదని , ఆ సమయంలోనే పవన్ తనవంతు సహాయాన్ని అందించి తనకు అండగా నిలిచినట్టు తెలిపారు.

పావలా శ్యామల గతంలో కిడ్నీ సంబంధించిన వ్యాధితో బాధపడ్డారు. ఆర్ధిక పరిస్ధితి బాగలేక తనకు వచ్చిన అవార్డ్స్ ను అమ్ముకుంటూ కాలం గడుపుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న 'నమస్తే తెలంగాణ' పత్రిక వైద్యం కోసం ఆమెకు సాయం చేయాలని ఒక కథనాన్ని ప్రచురించింది.'నమస్తే తెలంగాణ' కథనానికి స్పందించిన మానవతావాదులు తమవంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అలాగే ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కూడా స్పందించి, తన వంతు సాయంగా రూ.20 వేల రూపాయలను ఆవిడకు అందించారు. అంతేకాక ప్రతి నెల తన బ్యాంక్ ఎకౌంట్ నెంబర్‌లో రూ. 5 వేల రూపాయలు డిపాజిట్ చేస్తానని తెలిపారు.

5933
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles