సీఎం పాత్ర‌లో బాలకృష్ణ‌ ..!

Fri,February 1, 2019 09:08 AM
Balayya To Appear As CM In His Next movie

ఇటీవ‌లి కాలంలో రాజ‌కీయ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ప‌లు చిత్రాల‌లో మ‌న స్టార్ హీరోలు సీఎం పాత్ర‌లో కనిపించి సంద‌డి చేశారు. భ‌ర‌త్ అనే నేను చిత్రంలో మ‌హేష్ , నోటాలో విజ‌య్ దేవ‌ర‌కొండ సీఎంగా క‌నిపించి అభిమానుల‌ని అల‌రించారు. ఇక ఇప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ సీఎం పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శీను సినిమాలు మాస్ ప్రేక్ష‌కుల‌ని ఏ రేంజ్‌లో అల‌రిస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బాల‌య్య‌తో సింహా, లెజెండ్ చిత్రాలు తీసిన బోయ‌పాటి త్వ‌ర‌లో ఆయ‌న‌తో మూడో చిత్రం చేయ‌నున్నాడు. ఈ చిత్రం పొలిటిక‌ల్ నేప‌థ్యంలో ఉంటుంద‌ని స‌మాచారం. ఈ చిత్రంలో బాల‌కృష్ణ‌ని ప‌వ‌ర్‌ఫుల్ సీఎం పాత్ర‌లో ద‌ర్శ‌కుడు చూపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

ఫిబ్ర‌వరి మూడోవారం నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని స‌మాచారం. ఈ చిత్రాన్ని బాల‌య్య త‌న సొంత ప్రొడ‌క్ష‌న్ సంస్థ ఎన్బీకేపై నిర్మించ‌నుండ‌డం విశేషం. త్వర‌లోనే ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు. ఈ సినిమాతో హ్య‌ట్రిక్ కొట్టాల‌ని బోయ‌పాటి, బాల‌య్య భావిస్తున్నారు . మ‌రోవైపు త‌న తండ్రి ఎన్టీఆర్ జీవిత నేప‌థ్యంలో చేస్తున్న మ‌హానాయ‌కుడు చిత్రంలోను బాల‌య్య సీఎం పాత్ర‌లో క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

3269
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles