మ‌రో సినిమాకి నిర్మాత‌గా నంద‌మూరి హీరో

Wed,June 13, 2018 10:38 AM
balayya produce another movie

చివ‌రిగా జై సింహా చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన నంద‌మూరి బాల‌కృష్ణ త్వ‌ర‌లో మ‌ల్టిపుల్ ప్రాజెక్ట్స్‌తో బిజీ కానున్నాడు. త‌న తండ్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ప్ర‌ధాన పాత్ర పోషించ‌నున్న బాల‌య్య వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ ప్రాజెక్ట్‌, బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. ఎన్టీఆర్ చిత్రం లాంచ్ అయి చాలా రోజులే అవుతున్నా, ఈ మూవీ ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుంది అనే దానిపై క్లారిటీ లేదు. బాల‌య్య నిర్మాణంలో రూపొంద‌నున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌నే ఓ టాక్ కూడా న‌డుస్తుంది.

ఎన్టీఆర్ బ‌యోపిక్ చిత్రం సెట్స్ పైకి వెళ్ళే లోపు బాల‌య్య రెండు సినిమాల‌ని పూర్తి చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. సీ క‌ళ్యాణ్ నిర్మాణంలో వివి వినాయ‌క్ తెర‌కెక్కించనున్న ప్రాజెక్ట్ మే 27న లాంచ్ కానుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ చిత్రం యాక్ష‌న్ ఎంట‌ర్‌టైనర్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది. ఇక బోయ‌పాటితో క‌లిసి సింహా, లెజెండ్ చిత్రాలు చేసిన బాల‌య్య ఇప్పుడు మ‌రో మూవీ చేయ‌బోతున్నాడు. ఈ సినిమాని అతి త్వ‌ర‌లోనే లాంచ్ చేయ‌నున్నారు . ఈ చిత్రానికి బాల‌య్యే నిర్మాత‌గా ఉంటారని ఓ టాక్ న‌డుస్తుంది. ఎన్‌బీకే ఫిలింస్ బేన‌ర్‌పై బాల‌య్య ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మకంగా రూపొందించ‌నున్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఈ వార్త‌ల‌పై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

2417
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles