బాల‌య్య సంక్రాంతి సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడా..!

Sun,June 18, 2017 11:12 AM
balayya is followed pongal sentiment

టాలీవుడ్ లో పండగల సెంటిమెంట్ ఎక్కువ. ముఖ్యంగా తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి అంటే సినిమావారి క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతిసారీ సంక్రాంతి బరిలో పెద్ద హీరోల భారీ చిత్రాలు విడుదలవుతుంటాయి .సంక్రాంతికి తమ సినిమా విడుదల చేయడంకోసం ముందు నుంచే ప్లాన్ చేసుకుంటుంటారు. లెజెండ్ బాలకృష్ణకు కూడా ఆ సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు ఆయన చేస్తున్న మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

బాలకృష్ణ సినిమా సంక్రాంతికి వస్తుందంటే ఆయన అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. సంక్రాంతికి బాలకృష్ణ సినిమా వస్తే అది సూపర్ హిట్టేననేది ఫ్యాన్స్ లో బలమైన నమ్మకం ఉంది. అలాగే బాలకృష్ణకి కూడా సంక్రాంతి సెంటిమెంట్ వుంది. సంక్రాంతికి వచ్చిన ఆయన సినిమాలు దాదాపు ఘన విజయాలను అందుకోవడమే అందుకు కారణం. గత ఏడాది సంక్రాంతికి 'డిక్టేటర్' తో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సంక్రాంతికి 'శాతకర్ణి'తో హిట్ కొట్టాడు. ఇక వచ్చే సంక్రాంతికి కూడా తన మూవీ రిలీజ్ చేయడానికి బాలకృష్ణ రెడీగా ఉన్నాడు. వచ్చే నెల 10న కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ 102వ సినిమా లాంచ్ కాబోతోంది. ఆ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకోవడం విశేషం.

809
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS