వ‌ర్మ మూవీ ఆగిపోవ‌డంపై త‌న వివ‌ర‌ణ ఇచ్చిన ద‌ర్శ‌కుడు

Sun,February 10, 2019 07:09 AM
balas press note goes viral

అర్జున్ రెడ్డి రీమేక్ చిత్రం వ‌ర్మ మూవీ ఔట్‌పుట్ అనుకున్నంత బాగా రాక‌పోవ‌డంతో ఈ సినిమాని మ‌ధ్య‌లోనే ఆపేసి త్వ‌ర‌లో ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తున్న‌ట్టు నిర్మాత‌లు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజా చిత్రం ధృవ్ విక్ర‌మ్‌ ప్ర‌ధాన పాత్ర‌లోనే తెర‌కెక్క‌నుండ‌గా, ద‌ర్శ‌కుడితో పాటు చిత్ర న‌టీన‌టులు అంద‌రు కూడా మార‌తారు అని చెప్పుకొచ్చింది చిత్ర నిర్మాణ సంస్థ‌. అయితే నిర్మాత‌లు త‌నపై చేస్తున్న అస‌త్య ప్ర‌చారంపై తాజాగా స్పందించారు బాలా. ప్రెస్ నోట్ విడుద‌ల చేసిన ఆయ‌న సినిమా ఆగిపోవ‌డానికి తాను రూపొందించిన విధానం కార‌ణం కాద‌ని, క్రియేటివ్ ఫ్రీడ‌మ్ వ‌ల‌నే సినిమా నుండి త‌ప్పుకుంటున్న‌ట్టు పేర్కొన్నారు. త‌న‌పై నిర్మాత‌లు అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని కూడా తెలిపాడు. ధృవ్ కెరీర్ దృష్ట్యా ఈ విష‌యంపై తాను ఎక్కువగా మాట్లాడ‌ద‌లచుకోలేదని అన్నాడు ద‌ర్శ‌కుడు బాలా. చిత్ర యూనిట్‌తో కుదుర్చుకున్న ఒప్పందం జ‌న‌వ‌రి 22తోనే ముగిసింద‌ని, దానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. అయితే వ‌ర్మ ప్రాజెక్ట్ నుండి బాలా త‌ప్పుకోవ‌డంతో ఈ మూవీని తెర‌కెక్కించే బాధ్య‌త గౌత‌మ్ మీన‌న్ తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంద‌ని స‌మాచారం


1899
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles