డిఫ‌రెంట్ లుక్‌లో బాల‌య్య‌.. షాక్‌లో ఫ్యాన్స్

Tue,August 20, 2019 11:14 AM
Balakrishna new look from his up coming movie

త‌న తండ్రి ఎన్టీఆర్ జీవిత నేప‌థ్యంలో క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు అనే చిత్రాలు చేసిన బాల‌య్య ప్ర‌స్తుతం కేఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రూల‌ర్ అనే పేరుతో ఈ చిత్రం ప్ర‌చారం జ‌రుపుకుంటుంది. ఇటీవ‌ల చిత్ర షూటింగ్ ప్రారంభ‌మైన‌ట్టు తెలుస్తుంది. సోనాల్ చౌహ‌న్‌, వేదిక చిత్రంలో క‌థానాయిక‌లుగా న‌టిస్తార‌ని తెలుస్తుండ‌గా, భూమిక చావ్లా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. ఇక విల‌న్‌గా త‌మిళ భామ వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌ని తీసుకోవాల‌ని మేక‌ర్స్ భావించిననప్పటికి, అది వ‌ర్కవుట్ కాక‌పోవ‌డంతో ఆమె స్థానంలో న‌మిత లేడీ విల‌న్‌గా చిత్రంలో అల‌రించ‌నుంద‌ని చెబుతున్నారు. చిత్రంలో బాల‌య్య లుక్ ఎలా ఉంటుంద‌నే దానిపై కొద్ది రోజులుగా చ‌ర్చ‌లు నడుస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న లుక్ ఒక‌టి బ‌య‌ట‌కి వ‌చ్చింది. స్టైలిష్ గెడ్డంతో యంగ్ లుక్‌లో క‌నిపిస్తున్నారు బాల‌య్య‌. ఈ లుక్ అభిమానుల‌ని కూడా ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. జై సింహా త‌ర్వాత కేఎస్ ర‌వికుమార్- బాల‌య్య కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం రానుండ‌డంతో ఈ సినిమా పై అభిమానుల‌లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

2405
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles