విద్యాబాలన్‌కు ఘనస్వాగతం పలికిన బాలకృష్ణ

Wed,July 18, 2018 06:59 PM
Balakrishna Family grandly Welcomes to vidyabalan

హైదరాబాద్‌ : క్రిష్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ బయోపిక్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రం సెట్స్‌లో బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ జాయిన్‌ అయింది. ఈ సందర్భంగా బాలయ్య కుటుంబం విద్యాబాలన్‌కు సాంప్రదాయ పద్దతిలో ఘన స్వాగతం పలికింది. బాలయ్య భార్య వసుంధర దేవి, కూతుళ్లతో కలిసి విద్యాబాలన్‌కు చీరను బహూకరించి సత్కరించారు. ఈ ఫొటో ఆన్‌లైన్‌లో వైరల్ మారింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర కోసం విద్యా బాలన్‌ని ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే.

1652
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS